This Is Not A Show, Supreme Court Tells Haryana During Drought Hearing

This is not a show sc tells haryana during drought hearing

Supreme Court, Slam, haryana, Manohar Lal Khattar, ML khattar government, union government, drought, narendra modi, pm modi

The Haryana government was pulled up by a furious Supreme Court today, which was hearing a petition that had asked for help for farmers at a time 10 states have declared drought.

కరువు సహాయక చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు అక్షింతలు..

Posted: 04/12/2016 12:56 PM IST
This is not a show sc tells haryana during drought hearing

ఎవరు ఎన్ని సార్లు అక్షింతలు వేసినా తమ వైఖరి మారదన్నట్లు వ్యవహరిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. దేశవ్యాప్తంగా అర్రలు చాచిన కరువు విలయతాండవం చేస్తుంటే.. దానిని నియంత్రించేందుకు ప్రభు్వాలు ఏం చే్స్తున్నాయని ఏకంగా సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది, ఇప్పటికే కరువు సమస్యలపై సరిగా స్పందించని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు గట్టిగానే మందలిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా మొట్టికాయలు వేసింది,

అయినా దేశ అత్యున్నత న్యాయస్థానం  సుప్రీంకోర్టులో భంగపాటు తమకేమీ కొత్త కాదు అన్నట్లు, ఇక దానినే అలావాటు మార్చుకుంటున్న ప్రభుత్వాలకు మరోసారి ఛీవాట్లు పెట్టింది. ఇదేమైనా సినిమానా అంటూ వ్యాఖ్యానించింది. హర్యానాలో నెలకొన్న కరువు పరిస్థితులపై వివరణ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా ఆ వివరాలను సుప్రీంకోర్టు కోరింది. కేంద్రంతో పాటు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కలసి ఇచ్చిన అసంపూర్ణ అఫిడెవిట్ ను పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు రెండు ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది.

అయితే, హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ సమర్పించింది. అందులో పూర్తి వివరాలు ఇవ్వలేదు. దీంతో దీనిపై మండిపడిన సుప్రీంకోర్టు..'మేం ఎందుకు ఈ అసంపూర్ణంగా ఉన్న అఫిడవిట్ తీసుకోవాలి? మీరు ఇచ్చిన అఫిడవిట్లో మేం తనిఖీ చేయాల్సిన వివరాలు లేవు.. మేం మీ అఫిడవిట్ను స్వీకరించడం లేదు. ఇదేం సినిమాకాదు' అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. మనం చర్చించేది ఏ విహారయాత్ర గురించో.. రోడ్డు నిర్మాణాల గురించో కాదు.. ఎంతో తీవ్రమైన కరువు సమస్య గురించి, ప్రజల ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆలోచించకుంటే ఎలా అని సుప్రీంకోర్టు నిలదీసింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles