Massive fire breaks out in four-storey building in Bhiwandi, rescue ops underway

Fire engulfs factory cum residential complex many feared trapped

Bhiwandi powerloom, Thane district, fire breaks, garment factory, bhiwandi, mumbai, fire tenders, Bhiwandi Fire, Kasimpura, mumbai fire, thane building

A major fire broke out at a factory-cum-residential complex in Bhiwandi powerloom town of Thane district here on Tuesday, officials said.

ITEMVIDEOS: ముంబై శివార్లలోని భివాండి వస్త్రపరిశ్రమలో అగ్నిప్రమాదం..

Posted: 04/12/2016 11:05 AM IST
Fire engulfs factory cum residential complex many feared trapped

ముంబయి శివారులోని థానే జిల్లా భీవాండిలోని ఓ వస్త్ర పరిశ్రమలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనంలోని  గ్రౌండ్‌ ఫ్లోర్‌లో చెలరేగిన మంటలు వేగంగా పై అంతస్థులకు వ్యాపించాయి. దుస్తులు వేగంగా మంటలకు ఆహుతై మొత్తం నాలుగు ఫ్లోర్లకు మంటలు వ్యాపించాయి. జనవాసాల మద్యవున్న పరిశ్రమలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు స్థానికంగా పక్కనున్న నివాసాలకు కూడా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను నియంత్రించిన బీఎంసీ అధికారులు, పోలీసులు .. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఉదయం షిఫ్ట్‌లో పని చేస్తున్న 80 మంది కార్మికులు ఫ్యాక్టరీ పైకప్పు మీదకు చేరుకుని తమనకు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు.  

భారీ క్రేన్ల సహాయంతో ఘటనాస్థలానికి చేరుకున్న భద్రతా దళాలు.. ఫ్యాక్టరీలో పైకప్పులో చిక్కుకున్న కార్మికులతో పాటు నివాస సముదాయాలకు వ్యాపించిన మంటలతో తమను కాపాడాలని ఆర్తనాధాలు పెడుతున్న బాధితులను భద్రతా దళాలు రక్షించాయి, అయితే అనేక మంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే చిక్కుకున్నవారు 150మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. కాగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

భీవాండి అగ్ని ప్రమాదంపై తెలంగాణ జిల్లాల చేనేత కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. భీవాండి పరిసర ప్రాంతాల్లోని వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌ జిల్లాల చేనేత కార్మికులే పని చేస్తుంటారు. కాగా ఈ ఫ్యాక్టరీకి ఒకే ద్వారం వున్నందున లోపలి కార్మికులను బయటకు తరలించే అవకాశం లేదు. కేవలం నిచ్చెనల ద్వారా లేదంటే హెలికాప్టర్ల ద్వారా కార్మికులను సురక్షితంగా కిందకు దించే అవకాశం వుంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles