Weeks before being jailed, Sahara chief wanted to go abroad!

Subrata roy tried to go abroad before being jailed says sebi lawyer

Sahara chief, Subrata Roy, Sahara Group, Arvind Datar, abroad, Sebi lawyer, sebi vs sahara, sebi vs subrata roy, Subrata Roy wanted to go abroad, business discussions, former US President Bill Clinton, ex-UK PM Tony Blair,

Weeks before being sent to jail by the Supreme Court, the embattled Sahara Group chief Subrata Roy wanted to go abroad for "business discussions" with former US President Bill Clinton and ex-UK PM Tony Blair, Arvind Datar, Sebi's lawyer in this high-profile case, has said.

మాల్యా బాటలోనే విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసినా.. చిక్కిన బడా బిజినెస్ మెన్

Posted: 04/11/2016 12:08 PM IST
Subrata roy tried to go abroad before being jailed says sebi lawyer

మొత్తం 17 బ్యాంకులకు మస్కా కొట్టించి 9 వేల కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టేసి..  ఆర్థిక నేరానికి పాల్పడిన మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా... రుణాన్ని ఎగవేసి లండన్ పారిపోయినట్లుగానే మరో బడా బిజినెస్ మెన్ కూడా ఆయన బాటలోనే నడిచేందుకు ఉపక్రమించినా.. చివరకు తమ జోక్యంతో చిక్కారని ఓ ప్రముఖ న్యాయవాది ఇటీవల ఓ సదస్సులో తన అంతరంగంలోని మాటలను వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఒక వేళ విజయ్ మాల్యా తరహాలోనే ఈ బడా బిజినెస్ మెన్ కూడా దేశం విడిచి పారిపోయివుంటే ఆయన సంస్థలో డబ్బులు పెట్టిన అనేక మంది రోడ్డున పడేవారని అయన అన్నారు.

బడా బిజినెస్ మెన్ కూడా మల్యా తరహాలోనే విదేశాలకు వెళ్లివుంటే.. దేశానికి తిరిగి వచ్చేవారు కాదని, మాల్యా తరహాలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లాంటి దర్యాప్తు సంస్థలనే కాక, కోర్టుల నోటీసులను కూడా పెద్దగా పట్టించుకోకపోయేవారని స్పష్టం చేశారు. దేశం విడిచి వెళ్లేందుకు మరో బడా బిజినెస్ మ్యాన్ పక్కా ప్లాన్ వేసుకున్నారట. ఇంతకీ ఆ బిజినెస్ మెన్ ఎవరంటే,  దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది ఇన్వెస్టర్లను మాయ మాటలతో నమ్మించేసి 24 వేల కోట్ల డిపాజిట్లు సేకరించిన సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్.

2014 మార్చి 4 నుంచి తీహార్ జైల్లో ఊచలు లెక్కబెడుతున్న రాయ్... తన అరెస్ట్ కు ముందు దేశం విడిచి పారిపోయేందుకు యత్నించారట. సుబ్రతో రాయ్ కేసులో సెబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది అరవింద్ దాతర్ ఈ సంచలన విషయాన్ని నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగా వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ లతో వ్యాపార చర్చల పేరిట రాయ్ చల్లగా జారుకునేందుకు పక్కాగానే ప్లాన్ చేసుకున్నారని దాతర్ ఆరోపించారు.

అయితే, అప్పటికే సహారా గ్రూపు సేకరించిన డిపాజిట్లకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడానికి కాస్తంత ముందుగా ఆయన ఈ యత్నం చేశారట. అయితే రాయ్ ప్లాన్ వర్కవుట్ కాకముందే సుప్రీంకోర్టు ఆయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేయడం, పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కోర్టు ఆదేశాలు ఏ మాత్రం లేటైనా... సుబ్రతో రాయ్ కూడా డిపాజిటర్లను నిండా ముంచేసి విదేశాలకు చెక్కేసేవారేనని అన్నారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sahara chief  Subrata Roy  Sahara Group  Arvind Datar  abroad  Sebi  

Other Articles