trs conquered siddipet muncipality by winning 22 seats

Shock to ruling trs patry in siddipet muncipal polls

Siddipet Civic Polls, Siddipet Municipality, Indur Engineering College, Siddipet, telangana rastra samiti, congress, trs rebels, bjp, tdp, KCR, Chief minister, harish rao, lakshman

TRS conquered Siddipet Municipality with a win in 22 wards as the results declared today. siddipet people went to polls on April 6, and the results are declared in which opposition and party rebels also won few seats.

సిద్దిపేట పురపాలకం.. టీఆర్ఎస్ వశం.. సత్తాచాటుకున్న విపక్షాలు

Posted: 04/11/2016 11:27 AM IST
Shock to ruling trs patry in siddipet muncipal polls

తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది, టీఆర్ఎస్ పార్టీకి ఆది నుంచి అండగా వున్న సిద్దిపేటలో.. బీజేపి, కాంగ్రెస్ సహా స్వతంత్రులు తమ సత్తాను చాటారు. గత కొన్నేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుల ఇలాకాగా మారిన సిద్దిపేట మునిసిపాలిటీలో టీఆర్ఎస్ తమ జెండాను ఎగురవేసినా.. అటు విపక్షాలు కూడా తమ సత్తా చాటుకున్నాయి,

మొత్తం 34 వార్డులున్న సిద్దిపేట పురపాలక సంఘంలో 22 స్థానాలను కైవసం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పదవిని హస్తగతం చేసుకుంది, అయితే పార్టీకి అది నుంచి అండగా నిలిచిన సిద్దిపేటలో అటు కాంగ్రెస్, ఇటు కమల దళం భారతీయ జనతా పార్టీ సహా టీడీపీ కూడా తమ ఉనికిని చాటుకున్నాయి, ఇక భారీ స్థాయిలో టీఆర్ఎస్ రెబెల్స్ కూడా పార్టీకి సవాల్ విసిరి తమ సత్తాను చాటుకున్నారు.  మునిసిపాలిటీ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ టికెట్ పై బరిలోకి దిగిన శ్రీకాంత్ 14 వార్డులో, వెంకట్ 17 వార్డులో విజయ బావుటా ఎగురవేశారు

కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే వెల్లడైన సిద్దిపేట మున్సిపాలిటీ ఫలితాలలో స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ సత్తా చాటుకున్నారు, తెలంగాణ సీఎం కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుల సొంతూరైన సిద్దిపేటలో ఆరుగురు స్వతంత్ర (టీఆర్ఎస్ రెబెల్) అభ్యర్థులు విజయం సాధించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది, ఇక కాంగ్రెస్ రెండు వార్డులలో, బీజేపి రెండు వార్డులలో గెలుపోందగా, స్వతంత్రులు ఆరు వార్డులలో, టీడీపీ ఒక స్థానంలో గెలుపోందింది.

వార్డుల వారీగా గెలిచిన వారి వివరాలు ఇలా వున్నాయి.. 1వ వార్డులో మల్లికార్జున్ (టీఆర్ఎస్), 2వ వార్డులో లలిత (టీఆర్ఎస్), 3వ వార్డులో సంధ్య (స్వతంత్ర), 4వ వార్డులో దీప్తి (స్వతంత్ర), 5వ వార్డులో స్వప్న (స్వతంత్ర), 6వ వార్డులో భాగ్యలక్ష్మి (కాంగ్రెస్), 7వ వార్డులో ప్రశాంత్ (టీఆర్ఎస్), 8వ వార్డులో నర్సింహులు (టీఆర్ఎస్), 9వ వార్డులో ఉమారాణి (టీఆర్ఎస్), 10వ వార్డులో వేణుగోపాల్ (టీఆర్ఎస్) 12వ వార్డులో అక్తర్ పటేల్ (టీఆర్ఎస్), 14వ వార్డులో శ్రీకాంత్ (బీజేపీ) విజయం సాధించారు.

17వ వార్డులో వెంకట్ (బీజేపీ), 20వ వార్డులో జావేద్ (టీఆర్ఎస్), 22వ వార్డులో ప్రవీణ్ (స్వతంత్ర), 23వ వార్డులో తాళ్లపల్లి లక్ష్మి (టీఆర్ఎస్), 25వ వార్డులో కృష్ణ (స్వతంత్ర), 26వ వార్డులో శ్రీనివాస్ (టీఆర్ఎస్), 27వ వార్డులో విజయరాణి (స్వతంత్ర), 28వ వార్డులో ప్రభాకర్ (టీఆర్ఎస్), 30వ వార్డులో వాజీర్ (కాంగ్రెస్), 31వ వార్డులో కవిత (టీఆర్ఎస్), 33వ వార్డులో మోయిస్ (ఎంఐఎం), 34వ వార్డులో బోనాల మంజుల (స్వతంత్ర) విజయం సాధించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Siddipet Civic Polls  Siddipet Municipality  Indur Engineering College  Siddipet  

Other Articles