Wins for TMC in West Bengal, Left in Kerala: India TV-CVoter predict tough Assembly elections for NDA

Ldf comeback in kerala trinamool in bengal aiadmk in tn hung in assam

2016 Assam Assembly Election, 2016 Kerala Assembly Election, 2016 Tamil Nadu Assembly Election, 2016 West Bengal Assembly Election, AIADMK, BJP, Congress, CPI(M), DMK,

CPI(M)-led Left Democratic Front may stage a comeback in the forthcoming Kerala Assembly polls, while Mamata Banerjee's Trinamool Congress may retain power in West Bengal, says an opinion poll conducted by CVoter, telecast on India TV

అటు మమత, ఇటు లలిత.. కేరళలో అనవాయితీ.. అసోంలో హంగ్

Posted: 04/02/2016 10:43 AM IST
Ldf comeback in kerala trinamool in bengal aiadmk in tn hung in assam

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో నమో మంత్రం పనిచేయదని ఖాయంగా తెలిసిపోతుంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి ఉత్తరాదిన తన ప్రభావాన్ని ఎంతగానో్ కనబర్చినా.. దక్షిణాదిన మాత్రం తన సత్తాను చాటలేకపోతుంది. దక్షిణాధిన కర్ణాటక మినహా ఇప్పటి వరకు ఏ రాష్టంలోనూ తన అధిపత్యాన్ని స్పష్టంగా కనబర్చలేదు. కాగా తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అస్సోం మినహా ఎక్కడ తన ఉనికి చాటుకోలేకపోతుంది, నమో మంత్రంతో సార్వత్రిక ఎన్నికలలో ఊగిపోయిన భారతం.. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మాత్రం తమ ఉనికిని చాటుకునేందుకే శ్రమకు మించి చమటోడుస్తుంది.

బీజేపీ, కాంగ్రెస్‌కు కీలకంగా మారిన అస్సాంలో బీజేపి అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నా అక్కడ హంగ్ తప్పదని ఇండియాటీవీ-సీ ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఏప్రిల్ 4న తొలి విడత ఎన్నిక జరగనున్న అస్సాంలో బీజేపీ గణనీయంగా పుంజుకునే పరిస్థితులున్నాయని స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు 9 సీట్ల దూరంలో కమలానికి బ్రేక్ తప్పదని వెల్లడించింది. అయితే ఇక్కడ గత మూడు పర్యాయాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వుంది. అయితే చివరి క్షణంలో ఓటరు తీర్పు కూడా మారే అవకాశాలు వున్నాయి.

ఇక అస్సాంతోపాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న అంశంమై సర్వేలు నిర్వహించిన సీ ఓటర్, ఇండియా టుడే.. వాటి వివరాలను వెల్లడించింది. కేరళ ప్రజలు ఈ సారి కూడా తమ అనవాయితీని కొనసాగిస్తున్నారని పేర్కోంది. అధికార యుడిఎఫ్ కూటమికి గత ఐదేళ్ల పాటు అధికారాన్ని అందించడంతో ఈ సారి యూడిఎఫ్ కు బదులుగా విపక్ష లెఫ్ట్ కూటమి ఎల్డీఎఫ్ కు కేరళీయులు పట్టం కట్టనున్నారని వెల్లడించింది. ఇక పశ్చిమబెంగాల్, తమిళనాడులో అధికార పార్టీకే ప్రజలు మరోసారి పగ్గాలు అందించనున్నారని పేర్కొంది.

అస్సాంలో నువ్వా నేనా?
ఈశాన్య రాష్ట్రాల్లో తొలి అడుగు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ కూటమి.. 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో 55 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. అధికారం చేజిక్కించుకోవటం కష్టమని సర్వేలో తేలింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ నేతృత్వంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 53 స్థానాల్లో గెలవనుంది. ప్రస్తుత అసెంబ్లీలో 18 స్థానాలున్న ఆలిండియా యునెటైడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 12 సీట్లతో సరిపెట్టుకోనుందని, మొత్తంమీద అస్సాంలో హంగ్ తప్పదని తెలిపింది.

కేరళలో ఎగరనున్న అరుణపతాక..
కేరళలో గత కొన్ని పర్యాయాలుగా వస్తున్న ఆనవాయితీనే మళ్లీ అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టం చేసింది. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న కూటమికి విపక్ష హోదాను కల్పిస్తూ, విపక్ష కూటమికి అధికార పగ్గాలు కట్టబెట్టడం అక్కడ అనావాయితీగా వస్తుంది. ఐదేళ్లుగా విపక్షంలోఉన్నలెఫ్ట్ కూటమి భారీ మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకోనుందని సర్వే తెలిపింది. 140 సీట్లున్న అసెంబ్లీలో ఎల్డీఎఫ్ 86 సీట్లు గెలుచుకుంటుందంది. అధికార యూడీఎఫ్ 53 సీట్లు గెలుచుకోనుంది. బీజేపీ బోణి చేసినా ఒక సీటుకే పరిమితమవుతుందని సర్వే పేర్కొంది. అయితే బిజేపికి మాత్రం కేవలం ఒక్క స్థానంతోనే సరిపెట్టుకోవాల్స వస్తుంది.

బెంగాల్ పగ్గాలు మమతకే..
294 సీట్లున్న పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసిన మమత 184 సీట్లు గెలుచుకోగా.. ఈసారి 20 స్థానాలు తగ్గనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తున్న వామపక్ష పార్టీలు 106 సీట్లు గెలుచుకుంటాయని సర్వే తెలిపింది. 42 సీట్లున్న కాంగ్రెస్ ఈ సారి 21 సీట్లకే పరిమితం కానుంది. అయితే ఇక్కడే పాగా వేసి ప్రచార బాధ్యతలను చేపట్టినా బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు మాత్రం ఈ ఎన్నికలలో ఉనికి చాటుకునే అవకాశాలు వున్నాయని, నాలుగు స్థానాలలో బిజేపి గెలుపోందే అవకాశాలు వున్నాయని తెలిపింది.

అమ్మ పంచనే నిలచిన తమిళులు
కేరళ తరహాలోనే ఇక్కడి ప్రజలకు కూడా గత పలు పర్యాయాలుగా కొనసాగిస్తున్న అనవాయితీకి ఈ సారి బ్రేక్ పడనుంది. మరో్మారు అధికార పార్టీకే పట్టం కట్టబెట్టేందుకు తమిళులు సిద్దమయ్యారని సమాచారం. తమిళనాడులో 234 సీట్లకు గాను జయలలిత 130 స్థానాల్లో గెలుపొందనుండగా.. డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 70 సీట్ల వరకు వస్తాయని సర్వేలో వెల్లడైంది. విజయ్‌కాంత్ నేతృత్వంలోని మూడో కూటమి (వామపక్ష పార్టీలతో కలిపి) తో పాటు ఇతరులు 34 సీట్లు గెలిచే అవకాశాలున్నాయి. ఏఐఏడీఎంకే ఒంటరిగా బరిలో దిగగా, చిన్నాచితకా పార్టీలతో కలసి బరిలో దిగిన బీజేపీకి ఒక్క సీటు కూడా గెలిచే అవకాశాలు కనిపించటం లేదని.. సర్వే తెలిపింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  kerala  tamilnadu  west bengal  assembly elections  bjp  congress  

Other Articles