No half tickets in reserved seats in Railways

No half tickets in reserved seats in railways

Railways, half Tickets, Children, Kids, Railways Ministry

Railways estimates that around 21-22 million kids travel on half-tickets annually in trains. Since the passenger fares were not hiked in the rail budget this year, the move is being seen as a step to improve the finances of the Indian Railways.

హాఫ్ టికెట్ లేదు.. ఇక ఫుల్లే

Posted: 04/02/2016 08:48 AM IST
No half tickets in reserved seats in railways

రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ దగ్గర భర్త నాలుగు టికెట్లు అనగానే.. భార్య కాదు కాదు మూడు, ఒక హాఫ్ అని అంటుంది. ఎందుకంటే పిల్లలకు బస్సుల్లో, రైళ్లల్లో టికెట్ ఎంత తీసుకుంటారు…? ఐదేళ్ల లోపైతే ఫ్రీగా.. ఆపైన 5 – 12 అయితే హాఫ్ టిక్కెట్ అంతే కదా.. కానీ ఇప్పుడు రైల్వే శాఖ రూట్ మార్చింది. పిల్లలకు హాఫ్ టిక్కెట్ కాస్తా ఫుల్ టిక్కెట్ చేసేసింది. ఈ నెల 21 నుంచి రైల్లో ప్రయాణించే పిల్లలకూ ఫుల్ టికెట్ వసూలుచేస్తారని తెలిపింది రైల్వే శాఖ. 5 – 12 సంవత్సరాల పిల్లలకు రిజర్వుడ్ క్లాస్‌లో విడిగా బెర్త్/సీటు కావాలనుకుంటే… వారి నుంచి పూర్తి టికెట్ చార్జీని వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.

రిజర్వేషన్ దరఖాస్తు నింపే సమయంలోనే పిల్లలకు విడిగా బెర్త్/సీటు కావాలా.. లేదా అనే విషయం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ పిల్లలకు విడిగా బెర్త్/సీటు వద్దనుకుంటే వారికి ఇప్పుడున్నట్లే సగం చార్జీల విధానమే కొనసాగుతుంది. అన్‌ రిజర్వుడ్ టికెట్ల విధానంలో ఎలాంటి మార్పులేదు.మొత్తానికి సీటు కావాలంటే ఫుల్ టికెట్టే హాఫ్ టికెట్ కుదరదని రైల్వే శాఖ నిర్ణయం మీద ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Railways  half Tickets  Children  Kids  Railways Ministry  

Other Articles