Chandrababu naidu cheating

Chandrababu naidu cheating

chandababu naidu, AP, Amaravathi, AP State

AP CM Chandrababu Naidu cheating Ap people. He is escaping from all alligations with Amaravati. chandrabau cant bring funds to state till now.

వినరా.. సోదరా.. చంద్రబాబుగారి మోసబుద్ది గాధ

Posted: 04/02/2016 11:51 AM IST
Chandrababu naidu cheating

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రులను మరోసారి మోసం చేస్తున్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కి అసెంబ్లీలో తాత్కాలికంగా గెలిచాము అని అనుకున్నా.. ప్రజల్లో మాత్రం ఎక్కడో కనిపించని చోట అసహన పాతుకుపోయింది. అదే గనక ముదిరితే త్వరలోనే చంద్రబాబుకు షాక్ తగలడం ఖాయం. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా పతనం అంచులకు చేర్చుతున్న కారణాల్లో చాలా కారణాలే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పుల్లో మంత్రి బృందం పాత్ర కూడా లేకపోలేదు.

తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో.. దిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లుతున్న మన నాయకులను కాదని ఆ నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. అలాంటి పార్టీ నేపధ్యం ఉన్నా కానీ ఆయన మాత్రం కేంద్రం నుండి నిధుల కోసం చేయిచాచి అడుగుతున్నాడు. సరే అవసరం కాబట్టి అడగాల్సిందే అయితే అడుగుతున్న విధానమే అందరి చేత విమర్శలు గుప్పిస్తోంది. రెండు సంవత్సరాలు గడుస్తున్నా నిధుల విడుదల చెయ్యడంలో మీనమేషాలు లక్కిస్తున్న కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారు అన్నది ప్రశ్న. తమిళ నాయకులు ఎలా తమకు కావాల్సిన వాటిని  సంపాదించుకుంటారు. మరి మన వాళ్లు మాత్రం ఎందుకు అలా చెయ్యలేకపోతున్నారు..

ఆంధ్రులకు రాజధాని కూడా లేదు. అది కేవలం తన వల్ల మాత్రమే సాధ్యం అంటూ రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. దేశ దేశాలు తిరిగి... ఎందరెందరినో కలిసి తమ రాష్ట్రానికి సహాయం చెయ్యాలని అర్థిస్తున్నారు. దేశదేశాల్లో ఉన్న తెలుగు వారిని అందునా.. ఆంధ్రులను పుట్టిన భూమికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని అందుకు అందరూ కూడా సహాయం చెయ్యండి అని పిలుపునిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు అలా పోగేసింది ఎంత..?

మన ఆంధ్రప్రదేశ్ మని అమరావతి అంటూ సీమాంధ్రులు ఎవరు, ఎక్కడ ఉన్నా వారిని కలిసి అమరావతికి నిధులు సేకరిస్తున్నారు. అమరావతికి నా ఇటుక అని చివరకు ఇటుకలను కూడా అమ్ముకున్నారు. మరి అమరావతికి అంతలా పోగేసిన వాటిలో చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఎంత. మంత్రులు ఇచ్చింది ఎంత..? అమరావతి నిధుల పేరుతో చంద్రబాబు నాయుడు జోలెపట్టి అడుక్కున్నంత పని చేశారు. మరి ఇక్కడ ఆత్మగౌరవం అనే మాట కనిపించదా..? వినిపించదా..?

అమరావతి భూముల విషయంలో చంద్రబాబు నాయుడు, మంత్రులు చాలా గుట్టుగా వ్యవహారం నడుపుతున్నారని రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఓ మీడియాలో అయితే ఫలానా మంత్రి అన్ని ఎకరాలు, ఫలానా మంత్రి అన్ని వేల ఎకరాలు బొక్కేశారు అంటూ లెక్కలతో సహా వేశాయి. మరి దాని మీద ప్రతిపక్షాలు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలని డిమాండ్ చేస్తున్నా కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారు. దాని మీద ప్రతిపక్షాల మీదనే ఎదురుదాడి ఎందుకు చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ వెయ్యకుండా ఎందుకు దాటవేస్తున్నారు.

కేంద్రం నుండి నిధులు రాబతాం అని మేకపోతు గాంభీర్యం... తెలంగాణలో గెలిస్తే హైదరాబాద్ కు స్పెషల్ గా నిధులు రాబడతాం అని లోకేష్ లాంటి మితజ్ఞాని చేసిన వ్యాఖ్యలు వింటే నవ్వొస్తుంది. కేంద్రం నుండి నిధులు రాబట్టుకోలేని చంద్రబాబు నాయుడు అండ్ కో మాటలు మాత్రం బాగా మాట్లాడేస్తున్నారు. అయినా మోదీ నాకు బాగా క్లోజ్ అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇలా ఎందుకు బ్రతిమాల్సివస్తుంది. ఓటుకు నోటు కేసులో మోదీ తో కాళ్ల బేరానికి దిగిన మాట వాస్తవమా కాదా..? మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు మోదీ కాళ్ల దగ్గర పెట్టినట్టా కాదా..?

ప్రజలకేమో నీతి వాఖ్యలు చెబుతారు కానీ తాము మాత్రం అవి పాటించర. ప్రజలకు త్యాగాలకు సిద్దం కావాలని తెగ లెక్చర్ ఇస్తారు. కానీ తాను మాత్రం కోట్లు ఖర్చు చేసి విదేశీ పర్యటనలు చేస్తారు. అదేమిటి అంటే డిగ్నిటి అంటారు. అయినా మాకు డబ్బులు కావాలని అడిగే చోట రాయల్ గా కోట్ వేసుకొని.. మిస్టర్ మాకు డబ్బు కావాలి అని లక్సరీ హోటల్లో అడిగితేనే తప్ప డబ్బులు రాబట్టలేరా..? తనకు, తన మంత్రులకు ప్రత్యేకంగా ఛార్టెట్ ఫ్లైట్ ను ఏర్పాటు చేసుకున్న దుబారా ఖర్చు గురించి మీడియా మొత్తం కోడై కూసింది. అయినా కూడా వాటిని పట్టించుకోలేదు.

రాష్ట్రం కష్టాల కడలిలో ఉంది.. కాబట్టి ఉద్యోగులకు జీతాలకు కూడా డబ్బులు లేవు అని ప్రకటించిన అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యేలకు జీతాలు పెంచడం కరెక్టేనా.? అంటే పరులకైతే ఒక నీతి మనకైతే ఒక నీతినా.? ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఆంధ్రులను మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయంగా జరిగింది. మనకు తీవ్ర అన్యాయం జరిగింది అని నెత్తునోరుకొట్టుకునే ఈయనగారు ఇప్పుడు ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలి గాలి మేడల్లో, గాలి మోటర్లలో ఊరేగుతున్న చంద్రబాబు నాయుడుకు ముందు ముందు గడ్డు పరిస్థితులే ఎదురుకానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandababu naidu  AP  Amaravathi  AP State  

Other Articles