Uttarakhand Crisis: Congress Gets Chance To Prove Majority On Thursday

Hc orders floor test in uttarakhand on march 31

Uttarakhand, Uttarakhand Presidents Rule, uttarakhand, harish rawat, floor test, president rule, high court, Congress MLAs, Congress rebel MLAs, Uttarakhand Speaker Govind Singh Kunjwal, Abhishek Manu Singhvi, Presidents rule, breakdown of governance

Harish Rawat will take a trust vote on Thursday to determine if he can resume his term as Chief Minister of Uttarakhand, the state's top court has ruled.

హరీష్ రావత్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట.. విశ్వాస పరీక్ష జరపాల్సిందే..

Posted: 03/29/2016 08:13 PM IST
Hc orders floor test in uttarakhand on march 31

ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి ఈ నెల 31న విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో తన ప్రభుత్వ కోనసాగేందుకు మరో 24 గంటల వ్యవధిలో విశ్వాస పరీక్షకు వెళ్లనున్న హరీష్ రావత్ ప్రభుత్వాన్ని తోసిరాజి కేంద్ర అత్యంత నాటకీయ పరిణామాల మధ్య రాష్ట్రపతి పాలన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లనుందని సమాచారం.

రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్‌ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది.

70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఝలక్‌ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్‌ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్‌ స్పీకర్‌ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్‌ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttarakhand  harish rawat  floor test  president rule  high court  

Other Articles