lady factory employee abducted and gang raped in guntur

Woman abducted and gang raped in guntur

rape, woman raped, Woman Gang rape, gang rape, devarampadu, Rajupalem mandal, piduguralla police guntur, andhra pradesh, molestation on women, attrocities on women, harrassment on women

woman abducted and gangraped by five, while she was on her way to home from factory in devarampadu.

గుంటూరులో దారుణం, యువతిపై గ్యాంగ్ రేప్..

Posted: 03/29/2016 08:11 PM IST
Woman abducted and gang raped in guntur

గుంటూరులో దారుణం జరిగింది. స్నేహితుడని నమ్మిన ఓ యువతిని.. అమె స్నేహితుడు నయవంచన చేశాడు. అమెను అటోలో అపహరించుకుపోయి.. అతని నలుగురు స్నేహితులతో కలసి సామూహిత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని సుందరయ్యకాలనీకి చెందిన యువతి (25) స్థానికంగా ఓ ఫ్యాక్టరీలో పని చేస్తుంది. ఎప్పటిలాగే ఆమె సోమవారం రాత్రి ఏడు గంటలకు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె స్నేహితుడైన రహీం, మరో నలుగురు కలసి ఆమెను ఆటోలో ఎత్తుకుపోయారు.

సమీపంలోని దేవరంపాడు అటవీ ప్రాంతంలో ఆమెపై వరుసగా లైంగికదాడికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని... తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో వారు పిడుగురాళ్ల పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరులోని జీజీహెచ్కి తరలించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gang rape  devarampadu  Rajupalem mandal  piduguralla police guntur  andhra pradesh  

Other Articles