SS Rajamouli dedication getting awards to him

Ss rajamouli dedication getting awards to him

Baahubali, SS Rajamouli, Rajamouli, National Film Awards, rajamoulis Baahubali

Star Director SS Rajamouli who has the popularity in entire india.Now got one more honour with his film Baahubali. He bags National film awards best film as Baahubali

పట్టుదల+నిరంతర కృషి= రాజమౌళి

Posted: 03/28/2016 04:52 PM IST
Ss rajamouli dedication getting awards to him

అతడు కొంత మందికి కాసులు కురిపించే దేవుడిలాగా కనిపిస్తాడు.. మరికొంత మందికి నిరంతరం నేర్చుకుంటున్న విద్యార్థిలాగా కనిపిస్తాడు. మరికొంత మందికి తమ జీవతాన్ని మార్చే దేవుడిలాగా చూస్తారు.. మరికొంత మంది పనిరాక్షసుడిగా చూస్తారు. ఇలా ఒకరొకరికి ఒక్కోలాగా కనిపిస్తాడు ఎస్.ఎస్ రాజమౌళి. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. హిట్ తప్పితే ప్లాఫ్ అనే మాటకు రాజమౌళి డిక్షనరీలో చోటులేదు. తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ తీసుకువచ్చిన రాజమౌళి జక్కనగా చాలా మందికి సుపరిచితుడే.

తాజాగా అతడు ఎంతో ప్రతిష్మాత్మకంగా తీసిన బాహుబలి సినిమాకు నేషనల్ ఫిలిం అవార్డుల్లో బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో అవార్డు రావడంతో రాజమౌళి గురించి మరోసారి మీడియాలో చర్చసాగుతోంది. అయితే రాజమౌళి పనిలో ఎంతలా లీనమవుతారో అందరికి తెలిసిందే. ఆయన అనుకున్న అవుట్ పుట్ రావడానికి ఎంతలా కష్టపడతారో సినీ పరిశ్రమలో అందరూ కూడా వేనోళ్ల పొగుడుతారు. రాజమౌళి సినిమాల్లోకి రాక ముందు తన కజిన్స్‌తో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజు రాజమౌళి వదిన శ్రీవల్లి గారు పిలిచి అసలు నువ్వు ఏం కావాలని అనుకుంటున్నావు అని గట్టిగా మందలించడంతో అప్పుడు ఆలోచనల్లో పడ్డ రాజమౌళి మొదట రచయితగా, ఆ తర్వాత దర్శకుడిగా అవ్వాలనుకున్నాడు.

అలా మొదలైన రాజమౌళి ఆలోచన ఇప్పుడు తెలుగు వారే కాదు అందరూ కూడా గర్వపడేలా చేశారు. ఒక్క సినిమా కూడా పరాజయం పాలుకాకుండా రాజమౌళి సినిమాలు తీస్తున్న తీరు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజమౌళి మొదట రాఘవేంద్ర రావు వద్ద శిష్యరికం చేశాడు. గురువుగారి దర్శకత్వ పర్యవేక్షణలో ‘శాంతి నివాసం’ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించాడు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ అనే కాని, అన్ని కూడా రాజమౌళి చూసుకునే వాడు. అలా సీరియల్స్ నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రాజమౌళి. ఇక ఇప్పుడు ఇండియాలో టాప్ డైరెక్టర్లలో స్థానం సంపాదించుకున్నారు.

రాజమౌళికి జక్కన్న అనే పేరుంది. కాగా రాజమౌళి ఎక్కువ సినిమాలు  తీసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పేరు పెట్టాడని చాలా మంది అనుకుంటారు.. కానీ రాజమౌళికి ఆ పేరు పెట్టింది మాత్రం రాజీవ్ కనకాల. అవును శాంతి నివాసం సీరియల్ తీస్తున్న టైంలో రాజమౌళి పనితనం చూసిన రాజీవ్ కనకాల ఈ పేరుపెట్టారు. ఈ పేరుకు తగ్గట్లుగా సినిమా అనే శిల్పాన్ని ఎంతో అందంగా మలిచేందుకు రాజమౌళి ఎంత టైం అయినా తీసుకుంటాడు.. ఎంత బడ్జెట్ అయినా పెట్టిస్తాడు. కానీ చివరకు పెట్టిన ప్రతి రూపాయికి పదింతలు లాభం చూపిస్తాడు అందుకే రాజమౌళి అంటే నిర్మాతలకు ఎంతో ఇష్టం. నిర్మాత పెట్టిన ప్రతి రూపాయి కూడా లాభంగా మలచడంలో రాజమౌళి కృషిని మెచ్చుకోవాల్సిందే.

ఓ తెలుగు సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ జాతీయ చిత్రంగా నిల‌వ‌డం ఇదే మొద‌టిసారి. ఆ ఘ‌న‌త‌ను తెలుగు సినిమాకి అందించాడు రాజ‌మౌళి. గ‌తంలో శంక‌రాభ‌ర‌ణం, సాగ‌ర‌సంగ‌మం, రుద్రవీణ వంటి చిత్రాలు జాతీయ అవార్డులు అందుకున్నా.. కేవ‌లం ప్రాంతీయ ఉత్తమ చిత్రాల కేట‌గిరిలోనే అవార్డులు ద‌క్కించుకున్నాయి. నేష‌న‌ల్ వైడ్‌గా ది బెస్ట్ ఫిల్మ్‌గా నిలిచిన తొలి తెలుగు చిత్రం బాహుబ‌లి. తెలుగు సినిమా ప‌తాక రెప‌ర‌ప‌ల్ని జాతీయ స్థాయిలో నిలిపిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి. ప్రైడ్ ఆఫ్ టాలీవుడ్ అని మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు రాజ‌మౌళి.

రాజ‌మౌళి క్రియేట్ చేసిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. క‌లెక్షన్ల ప‌రంగా ఇది ఆలిండియా టాప్ 3లో ఒక‌టి. ఆరువంద‌ల కోట్ల‌కుపైగా క‌లెక్ట్ చేసింది. తాజాగా ఉత్తమ జాతీయ చిత్రంగా నిల‌వ‌డం రాజ‌మౌళి క్రియేటివిటీకి, బాహుబ‌లి యూనిట్‌కి ఇది మ‌రో గుర్తింపు. రీసెంట్‌గా మ‌ర్యాద‌రామ‌న్న మిన‌హా రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన మ‌గ‌ధీర‌, ఈగ చిత్రాల‌కు ప్రాంతీయ ఉత్తమ చిత్రాలుగా అవార్డులు ద‌క్కాయి. ఇటు ఆ సినిమాల సాంకేతిక నిపుణుల‌కు కూడా జాతీయ స్థాయిలో అవార్డులు వ‌చ్చాయి. బాహుబలి ఏకంగా జాతీయ ఉత్తమ చిత్రంగా నిల‌వ‌డం తెలుగు సినిమాకి ద‌క్కిన గౌర‌వం.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలకు నేషనల్ వైడ్ గా గుర్తింపు తీసుకురావడమే కాకుండా తెలుగు సినిమా స్టాండర్డ్ ను పెంచారు రాజమౌళి. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు అంటూ పెద్దలు చెప్పిన మాట అక్షాల సత్యం అని మరోసారి రాజమౌళి నిరూపించారు. కష్టపడటం వరకు మాత్రమే మన చేతల్లో ఉంది అన్న భగవద్గీతలోని మాటలకు రాజమౌళి సరైన న్యాయం చేస్తున్నారు కాబట్టే ఆయనకు ఇన్ని అవార్డులు.. ఇంత గుర్తింపు వస్తున్నాయి. రాజమౌళి మరిన్ని సినిమాలు తీసి.. మన తెలుగు వారి కీర్తి పతాకాలు మరింతగా ఎగరవెయ్యాలని మనసారా కోరుకుంటూ.....

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Baahubali  SS Rajamouli  Rajamouli  National Film Awards  rajamoulis Baahubali  

Other Articles