Cops thrashed devotees at Mehandipur Balaji Temple on Holi

Police manhandled devotees in mehandipur balaji temple

Rajasthan, Devotees, Cops manhandle, Mehandipur Balaji Temple, caught on camera, Cops. police attack, rajasthan,

A short mishap happened between pilgrims and Police in Mehandipur Balaji Temple in Dausa Rajasthan.

ITEMVIDEOS: భక్తులపై పోలీసులు దౌర్జన్యకాండ.. దేవుడి సాక్షిగా జులుం

Posted: 03/25/2016 06:21 PM IST
Police manhandled devotees in mehandipur balaji temple

ప్రజల రక్షణ కోసమే తాము విధులు నిర్వహిస్తున్నామన్న కనీస ఇంకితాన్ని మర్చి.. ప్రజలపైనే దాడులకు తెగబడిన పోలీసుల దౌర్జన్య పర్యం ఇది. దేవుడి దర్శనం కోసం గుడికి వచ్చిన భక్తులపైనే పోలీసులు దౌర్జన్యకాంఢకు పాల్పడ్డారు. సామాన్యులపై తమ కాకీ కర్కశత్వాన్ని చూపించారు. దొంగలతో, రౌడీషీటర్లతో వ్యవహరించిన రీతిలో మహిళలు, వృద్ధులపై తెగబడి అలజడి సృష్టించారు. కనీసం భక్తులన్న ఇంకితం, వారి వయస్సుకు గౌరవం కూడా ఇవ్వకుండా విచక్షణరహితంగా అడ, మగ, పిల్ల, జెల్లలపై దాడులకు పాల్పడి జులం ప్రదర్శించారు. అత్యంత హేయకరమైన ఈ దాడి రాజస్థాన్ లోని దౌసాలో చోటుచేసుకుంది.

రాజస్థాన్ లోని దౌసా జిల్లా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెహందీపూర్ ఆలయంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులపై ఖాకీలు అమానవీయంగా ప్రవర్తించారు. మహిళల పట్ల నలుగురు పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. వారిని పక్కకు తోసేసి దౌర్జన్యం చేశారు. అదేమని అడిగిన పురుషులపై దాడికి దిగారు. విచక్షణారహితంగా కొట్టారు. పోలీసుల దౌర్జన్యంపై భక్తులు తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన  వీడియో ఒకటి బయటకు రావడంతో ప్రస్తుతం అది నెట్ లో హల్ చల్ చేస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు పూనుకుంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles