Fortune Magazine ranks Arvind Kejriwal 42 out of 50 in World's Greatest Leaders List

Arvind kejriwal only indian on fortune s 50 greatest leaders list

arvind kejriwal,Fortune magazine 50 world's greatest leaders,50 world's greatest leaders list,Fortune Magazine,ODD EVEN rule,odd even scheme,odd even formula,Delhi pollution

Two-time Delhi Chief Minister and Aam Aadmi Party Convenor Arvind Kejriwal was featured by Fortune magazine in its list of 50 World's Greatest Leaders.

ప్రపంచ అత్యుత్తమ నేతల జాబితాలో ఒకేఒక్క భారతీయుడు

Posted: 03/25/2016 06:24 PM IST
Arvind kejriwal only indian on fortune s 50 greatest leaders list

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. విశ్వవ్యాప్తంగా 50 మంది అత్యంత గోప్ప నాయకులలో ఒకరిగా ఆయన తన పేరును మారుమ్రెగేలా చేసుకున్నారు. అది కూడా యావత్ భారత దేశంలోనే ఆయన ఏకైన నాయకుడిగా ఫార్చ్యూన్ పత్రిక పేర్కోంది. దేశ రాజధాని నగరంలో కాలుష్యభూతాన్ని తరిమికొట్టడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన  చర్యలు ఆయన్ని ప్రపంచ గొప్ప నాయకులలో ఏకైక భారతీయ నాయకుడిగా నిలిపాయి.

ఫార్చ్యూన్  పత్రిక  ప్రకటించిన మూడో వార్షిక అవార్డులో కేజ్రీవాల్ ఈ ఘనతను సాధించారు. ప్రపంచ గొప్పనాయకుల  జాబితాలో 42వ  స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్  వెల్లడించిన మూడో వార్షిక  వరల్డ్ 50 గ్రేటెస్ట్ లీడర్ల జాబితాలో ఒక్క కేజ్రీవాల్‌కు మాత్రమే స్థానం లభించింది. దేశ రాజధాని నగరం కాలుష్య నియంత్రణలో సీఎం ప్రవేశపెట్టిన సరి-బేసి వాహనాల పద్ధతి తమకు నచ్చిందని పత్రిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, ప్రభుత్వం, దాతృత్వం, కళల లాంటి వివిధరంగాల్లో ప్రముఖంగా, ఆదర్శవంతంగా నిలిచిన వారి పేర్లతో ఈ జాబితాను ఫార్చ్యూన్ ప్రకటిస్తుంది.

అమెరికా వ్యాపార దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, బెజోస్ వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచారు. జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ రెండు,  ఆంగ్‌సాన్ సూకీ మూడు, పోప్ ఫ్రాన్సిస్ నాలుగో స్థానాలను దక్కించుకున్నారు. ఇక భూటాన్ ప్రధాని  షెరింగ్ టోబ్‌గె  50 వ ర్యాంకు సాధించారు. అటు కేజ్రీవాల్ తో పాటు దక్షిణ కరొలినాకు చెందిన భారతీయ అమెరికన్ గవర్నర్ నిక్కి హీలే 17వ స్థానంలో ఉండగా, హిందూ అమెరికన్ రేషం సౌజని  20వ ర్యాంకు సాధించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arvind Kejriwal  world 50 greatest leaders  Fortune magazine  sole Indian  42 rank  pollution  

Other Articles