How many Rohiths will you kill? Kanhaiya Kumar launches attack on Centre in Hyderabad University

We will siphon justice for rohith vemula says kanhaiya kumar

Kanhaiah kumar, HCU tour, left parties, VC Apparao, vemula rohit, AndhraPradesh, Hyderabad Central University (HCU), Rohith Vemula, JNU Row, Rohith Vemula suicide case

JNUSU president Kanhaiya Kumar on Wednesday slammed the Hyderabad University authorities and said that no force would be able to stop them from siphoning justice for Rohith Vemula.

ఎంత మంది రోహిత్ లను బలి తీసుకుంటారు..? కేంద్రంపై మండిపడ్డ కన్హయ్య కుమార్

Posted: 03/23/2016 06:55 PM IST
We will siphon justice for rohith vemula says kanhaiya kumar

లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ  తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.
 
తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి వచ్చిన కన్హయ్య కుమార్ తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు.

అటు తెలంగాణలో సభ నిర్వహించేందుకుండా హెచ్ సి యూ లోనికి వెళ్లేందుకు సిబ్బంది అడ్డుకోవడంతో ఇటు అంధ్రప్రదేశ్ లోకి అడుగుపెట్టిన కన్హయ్యకు అడుగడుగునా ప్రభుత్వం నుంచి ఆటంకాలు కల్పించడాన్ని పది కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా ఖండించాయి. సభ నిర్వహణకు పోలీసులు ముందుగానే అనుమతిని ఇచ్చినా.. ప్రభుత్వం అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఓ విద్యార్ధి సంఘ నాయకుణ్ణి చూసి పాలకులు ఇంతగా బెంబేలు ఎత్తాలా? అని ప్రశ్నించాయి. ప్రజాస్వామ్యంలో మీటింగ్ జరుపుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించాయి. ఐవీ ప్యాలెస్ సెంటర్‌లో జరిగే సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయి పాలకులకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kanhaiah kumar  HCU tour  left parties  VC Apparao  vemula rohit  AndhraPradesh  

Other Articles