ED working under political pressure of its bosses, alleges Virbhadra Singh

Ed attached worth 8 crore of assets of himachal cm virbhadra singh

Enforcement Directorate, Himachal Pradesh Chief Minister Virbhadra Singh, State Youth Congress president Vikramaditya Singh, New Delhi 'uncalled action' suo-motto action, 'political pressure. political bosses, Himachal CM, 8 Crore Attach, Money Laundering Case, Himachal pradesh

Virbhadra Singh dubbed the attachment of the property by the ED as an 'uncalled action' and alleged that it was a suo-motto action conducted by the organisation under the 'political pressure of their political bosses'.

సీఎంకు ఎదురుదెబ్బ.. పొలిటికల్ బాస్లు అడిస్తున్న నాటకమని సింగ్ వ్యాఖ్య

Posted: 03/23/2016 06:57 PM IST
Ed attached worth 8 crore of assets of himachal cm virbhadra singh


హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల కింద కేసునమోదు చేసిన ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు ఆయన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఆయనతో పాటు అయన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తెలిపారని ఓ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించి సంచలనాన్ని రేపింది.

తనపై ఈడీ చేస్తున్న దర్యాప్తును ఆపేయాలని, స్టే విధించాలని కోరుతూ వీరభద్ర సింగ్ గత వారం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లినా కోర్టు అందుకు అనుమతించలేదు. దీంతో ఈడీ మరోసారి ఆయన ఆస్తుల విషయంలో వేగంగా కదిలి రూ.8కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అయితే, ఏమేం ఆస్తులు అటాచ్ చేశారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఉక్కుశాక మంత్రిగా 2009-11 కాలంలో పనిచేసినప్పుడు ఆయన, తన కుటుంబం కలిసి మొత్తం రూ.8కోట్లను అక్రమంగా సంపాధించారని కేసులు నమోదయ్యాయి.

కాగా తన కుమారుడు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు విక్రమాదిత్య సింగ్ సంబంధించిన ఎనమిది కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేయడం అనూహ్య పరిణామమని, ఊహించని విధంగా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. అయితే ఇదే సందర్భంగా ఎన్ఫోర్స్ డైరెక్టరేట్ అధికారులు తమంతట తాముగా సుమోటోగా ఈ చర్యలను తీసుకున్నారని, ఇదంతా కేవలం రాజకీయ వత్తిళ్లతోనే సాగుతుందని, వారి పొలిటికల్ బాస్ లను సంతృప్తి పర్చుతూ వారి అదేశాల మేరకే చేస్తున్నారని అరోపించారు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virbhadra Singh  Himachal CM  7 Crore Attach  Money Laundering Case  Himachal pradesh  

Other Articles