Rio 2016 definitely be my last Olympics: Usain Bolt

Usain bolt to make rio his last olympic games

usain bolt, usain bolt updates, bolt medals, bolt races, bolt news, bolt races, usain bolt rio olympics, usain bolt retirement, sports

Usain Bolt told in an interview that the curtain would come down on his Olympic career in this year's games in Rio de Janeiro.

పరుగు అపేస్తానంటున్న వీరుడు.. రియో చివరి ఒలంపిక్స్ అని ప్రకటన

Posted: 03/22/2016 06:30 PM IST
Usain bolt to make rio his last olympic games

అతడు పరుగు వేగాన్ని అందుకోవాడం చిరుతకు కూడా సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదేమో. పరుగుల పందెంలొ అతని రికార్డులను తానే అధిగమించి ఎప్పటికప్పుడు నూతన చరిత్రను సృష్టించుకోవడం అతనికి అలవాటుగా మారింది. ఆ పరుగు వీరుడే ఉసేన్ బోల్ట్.. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన ప్రతీసారి తన ప్రత్యర్థులు కోరుకునే విషయాన్ని ఆయన ఇవాళ ప్రకటించి అభిమానులను అందోళనకు గురిచేశాడు. ఇకపై తాను పరుగులు ఆపేస్తున్నానని వెల్లడించాడు.

ఈ ఏడాది రియో డి జెనిరోలో జరగనున్న ఒలింపిక్స్‌ తర్వాత రిటైరవుతానని నిర్ధారించాడు. ఆరుసార్లు ఒలింపిక్స్‌లో స్వర్ణపతకాలు సాధించిన బోల్ట్ 2020 వరకు కూడా ఆడే అవకాశం ఉందని జనవరిలో చెప్పినా.. ఇప్పుడు మాత్రం ఇవే తన చిట్టచివరి ఒలింపిక్స్ అని స్పష్టం చేశాడు. మరో నాలుగేళ్లు ఇదే స్థాయిలో పరుగులు తీయడం చాలా కష్టమని, అందువల్ల రియోలో తాను అనుకున్నది సాధించి, ఆ తర్వాత ఇక రిటైర్ అవుతానని చెప్పాడు.

లండన్‌లో 2012లో జరిగిన ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్లు, 4x100 మీటర్ల రిలే రేసుల్లో బోల్ట్ స్వర్ణపతకాలు సాధించాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితం బీజింగ్‌లో జరిగిన క్రీడల్లోనూ ఈ విభాగాలన్నింటిలో అతడే విజేత. తుపాకి నుంచి బుల్లెట్ బయటకు రావడం అయినా ఆలస్యం అవుతుందేమో గానీ, ఉసేన్ బోల్ట్ ఇలా పరుగు ప్రారంభించడం, అలా గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావని క్రీడా పండితులు చెబుతుంటారు.

మరోసారి ఒలింపిక్స్‌లో మూడు బంగారు పతకాలు గెలవాలన్నది తన కల అని, దానిపైనే దృష్టిపెడుతున్నానని బోల్ట్ చెప్పాడు. 200 మీటర్ల పరుగులో 19.19 సెకన్లతో ప్రపంచ రికార్డు ఉసేన్ బోల్ట్ పేరుమీదే ఉన్నా.. అతడికి మాత్రం సంతృప్తి లేదు. కనీసం 19 సెకన్ల లోపు ఆ రేసు పూర్తి చేయాలని తాను కలగంటున్నట్లు తెలిపాడు. ఇలాంటి పరుగుల చిరుతను ఇక ట్రాక్ మీద చూడకపోవడం అంటే క్రీడాభిమానులకు నిరాశే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ussain Bolt  bolt retirement  rio olympics  athletics  

Other Articles