Tainted India fast bowler S Sreesanth to contest in Kerala assembly polls for BJP

Bjp planning to field cricketer s sreesanth in kerala polls

S Sreesanth, Kerala assembly polls, BJP, Eranakulam, Amit Shah, IPL, spot-fixing, BCCI, sreesanth bjp elections, kerala elections, kerala polls, sreesanth kerala elections, sreesanth bjp kerala elections, kerala assembly elections

Tainted Indian fast bowler S Sreesanth will begin a new innings in life after he decided to contest in Kerala assembly polls for the BJP.

క్రికెటర్, యాక్టర్ తరువాత.. శ్రీశాంత్ రాజకీయ నేత అవతారం,,

Posted: 03/22/2016 06:33 PM IST
Bjp planning to field cricketer s sreesanth in kerala polls

స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కోని తన క్రికెట్ కెరీర్ ను జారవిడుచుకున్న టీమిండియా మాజీ క్రికెటర్, కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ మరో కోత్త అవతారంలోకి అడుగుపెట్టనున్నాడు. క్రికెటర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీశాంత్ ఆ తరువాత తన కెరీర్ రసకందాయంలో పడటంతో సినిమా నటుడిగా మారాడు. మళయాళ చిత్రాలతో పాటు పలు బాషల చిత్రాలలో తన నటనాభినయం ప్రదర్శించాడు, తాజాగా రాజకీయ నేతలు అవతారం ఎత్తనున్నాడు. కేరళలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయన రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు మెండుగా వున్నాయి.

త్వరలో జరిగే కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీశాంత్ను బరిలో దింపాలని బీజేపీ యోచిస్తోంది. బీజేపీ నాయకులు ఈ విషయంపై శ్రీశాంత్ను సంప్రదించగా, తాను ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంకేతాలను ఇస్తూనే మరోవైపు 24 గంటల సమయాన్ని కోరినట్లు తెలుస్తుంది. కాగా మే 16న కేరళ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో శ్రీశాంత్ ఎర్నాకులం జిల్లా లోని త్రిప్పునిత్తుర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలని యోచిస్తున్నారని, ఇప్పటికే ఈ సీటుపై ఆయన పార్టీ వర్గాల నుంచి కూడా అనుమతి పోందినట్లు సమాచారం.

ప్రస్తుతం కేరళ ఎక్సైజ్ శాఖ మంత్రి కె. బాబు అక్కడ తీవ్ర విమర్శలను ఎదుర్కోంటున్నారు. మద్యం దుకాణాలను బంద్ చేయించడంతో ఆయనపై మహిళలలో సానుభూతి వ్యక్తం అవుతుండగా, పురుషులు మాత్రం విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో త్రిప్పునిత్తుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేయనున్నట్లు సమాచారం. కేరళ పర్యటనకు వచ్చినపుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో శ్రీశాంత్ సమావేశం కావచ్చని సమాచారం.

కాగా క్రికెటర్ శ్రీశాంత్ తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదని కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజశేఖరన్ చెప్పారు. శ్రీశాంత్ సెలెబ్రిటీ కావడంతో బీజేపీ అధిష్టానం నేరుగా అతనితో సంప్రదించి ఉంటుందని మరో నేత అన్నారు. అయితే ఈ ఎన్నికలలో ఆయన పోటీ చేసే విషయం అధిష్టానం తమకు నిదానంగా చెప్పే అవకాశం లేకపోలేదని మరో నేత చెప్పిరు. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన శ్రీశాంత్ ఆ తర్వాత క్రికెట్కు దూరమయ్యాడు. గతేడాది ఢిల్లీ కోర్టు శ్రీశాంత్ను నిర్దోషిగా ప్రకటించింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Sreesanth  Cricketer  Kerala assembly elections  

Other Articles