High Court | suspension petititon | roja | YSRCP | jagan

Ycp mla roja suspension petition in high court

hish court, supreme court, supreme court directions, ycp mla roja, ysrcp mla roja, mla roja suspension petition, roja suspended, jagan mohan reddy, nagari mla, ap government, ap assembly, ap secratariat

The High Court of Judicature at Hyderabad to take up for hearing the plea of YSR Congress MLA R K Roja, challenging her one-year suspension from the Assembly

రోజా పిటీషన్ పై హైకోర్టులో విచారణ.. వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు

Posted: 03/21/2016 01:52 PM IST
Ycp mla roja suspension petition in high court

తనను శాసనసభ నుంచి ఏడాది కాలం పాటు అన్యాయంగా సస్సెండ్ చేశారని, నిబంధలను ఉల్లంఘించి తనపై కావాలనే కక్షపూరితంగా ఈ చర్యలు చేపట్టిందని పేర్కోంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా దాఖలు చేసిన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరగుతుంది. ఇప్పటికే న్యాయస్థానంలో రోజా తరపున అమె న్యాయవాది ఇందిర తన వాదనలను వినిపించారు. అయితే రాష్ట్రోన్నత న్యాయస్థానం సింగిల్ బెంగ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పాటించకుండా.. తనను అసెంబ్లీలోనికి అడుగుపెట్టనీయకుండా అడ్డుకున్నారంటూ అమె ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.

కోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేఖాతరు చేయడం పై ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ఉత్తర్వుల కాపీని తాను అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించి.. మరుసటి రోజు ఉదయాన వస్తానని చెప్పానని, అయితే మరుసటి రోజున తాను అసంబ్లీ లోనికి వెళ్లబోగా, మార్షల్స్ అడ్డుకున్నారని.. అడిగితే లోపనికి రానివ్వకూడదని తమకు అదేశాలు ఇచ్చిరని మార్షల్స్ తెలిపారని.. ఇది కోర్టు ధిక్కారమని భావించిన అమె ప్రభుత్వంపై కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు.

మరో వైపు ఏపీ సర్కార్ సైతం మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పీల్ కు వెళ్లనున్నారు. దీంతో హైకోర్టు రెండు పిటిషన్లపై విచారణ చేపట్టనంది. రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ-సెక్స్‌రాకెట్‌పై వైఎస్సార్‌సీపీ శాసనసభ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టిన సందర్భంగా ఎమ్మెల్యే రోజా అనుచితంగా నినాదాలిచ్చారంటూ ఆమెను రూల్ 340(2) ప్రకారం ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం, స్పీకర్ మూజువాణి ఓటుతో దాన్ని ఆమోదించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Court  suspension petititon  roja  YSRCP  

Other Articles