UP Shame! Girl records video to prove rape by father

18 year old records video to prove rape by father

UP crime,girl raped by father,rape,Jalaun father rapes daughter, up father rapes girl, child sexual abuse,molestation, rape, gangrape, molestation on women, harrassment on women, attrocities on women, rape on women, ,rape,rape case

A man from Uttar Pradesh has been arrested after his 18-year-old daughter recorded a video of him sexually assaulting her, the police have said.

తండ్రి తనపై జరిపే అత్యాచారాన్ని వీడియో తీసిన యువతి..

Posted: 03/21/2016 01:55 PM IST
18 year old records video to prove rape by father

కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామాంధుడైతే... కన్న కూతురిపైనే తన కామ వాంఛను తీర్చుకుంటే.. ఆ తండ్రిపై ఆ కూతురికి రోత పుట్టి.. తన మనసులో బాధను తల్లితో పంచుకుంటే, ఆమె నమ్మకుండా చివాట్లు పెట్టి పెడార్థాలు తీస్తూ చిరాకుపడితే. ఆ అమ్మాయి బాధ చెప్పనలవి కాదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఉత్తరప్రదేశ్ లోని జలావున్ జిల్లాలో ఓ యువతికి ఎదురైంది. సభ్య సమాజం తలదించుకునేలా.. ఆ తండ్రి చేసిన అకృత్యాలు వెలుగు చూడడంతో ఆ తండ్రి కటకటాలు లెక్కపెడుతన్నాడు.

వివరాల్లోకి వెళ్తే..  ఉత్తరప్రదేశ్ లోని జలావున్ జిల్లాలో ఓ యువతిపై తన తండ్రే అత్యాచారానికి పాల్పడుతున్నాడు. తన తండ్రే తనపై ఈ దారుణానికి ఒడిగడుతున్నాడన్న అవేదనను బయటికి చెప్పుకోలేక మిన్నకుండిపోయింది. ఆ తరువాత తండ్రి చేతిలో రోజు దారుణానికి గురైంది. దీంతో ఉండబట్టలేక తన తండ్రి పైశాచికత్వంపై తల్లికి చెప్పుకుని భోరున విలపించింది. కాగా ఆమె నమ్మలేదు సరికదా, కూతురినే తిట్టి పోసింది. ఇక ఆమెకు సాక్ష్యం చూపాలని భావించి, ఆత్మగౌరవాన్నే పక్కన పెట్టింది.

తన తల్లే తన మాటలను విశ్వసించని తరుణంలో రక్షణ కోసం పోలిస్ స్టేషన్ కు వెల్లినా వాళ్లు కూడా సాక్షాధారాలు అడుగుతారని భావించిన యువతి.. తండ్రి అత్యాచారాన్ని వీడియో తీయమని స్నేహితుడితో మొర పెట్టుకుంది. స్నేహితుడు తీసిన వీడియోను తల్లికి సాక్ష్యంగా చూపింది. ఇలాంటి తండ్రి ఎవరికీ ఉండకూడదని, బహిరంగంగా చంపేయాలని, సులభంగా చంపకుండా, బాధపడుతూ చంపాలని కన్నీళ్లతో కోరుతోంది. వీడియోను చూసిన పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ అమ్మాయికి ఇప్పుడు మహిళా సంఘాలు తోడుగా నిలిచాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP crime  girl raped by father  rape  Jalaun  

Other Articles