Identical Perth twins Anna and Lucy Decinque vow to fall pregnant at the same time

Oz twins share a boyfriend and want to get pregnant together

Perth,identical,twins, Anna, Lucy Decinque share, boyfriend, twins voe to have single boy friend, twins pregnant

Twins who share everything including their BOYFRIEND vow to get pregnant at the same time because 'their bodies need to be identical'

అమ్మో.. ఈ కవల అక్కచెల్లళ్ల రూటు సపరేటు..

Posted: 03/20/2016 11:59 AM IST
Oz twins share a boyfriend and want to get pregnant together

సాధారణంగా ట్విన్స్ అనగానే వారి రుచులు, అభిరుచులు వారి రూపాల మాదిరిగానే ఒకేలా వుంటారన్నది జగమెరిగిన సత్యం. అకారాలలో ఒకటేలా వుండే వీరు అలవాట్లలలో అహార్యలలో కూడా ఒకటే మాదిరిగా అలోచిస్తారు. ఒకేలా వస్త్రాలంకరణ చేసుకోవడం, ఒకేలా ఆలోచించడం, ఒకే అనుభూతులు వ్యక్తపరచడం లాంటి వింతలు ఉంటాయి. కానీ, ఎంత కవలలయినా వ్యక్తిగత విషయాలకు వచ్చే సరికి తమకంటూ కొంత వసీని పాటిస్తుంటారు. తాము మెచ్చిన వారు.. తన ట్విన్ తో ఎక్కడ వీరి విషయంలో మాత్రం షేర్ చేసుకోకుండా జాగ్రత్త పడుతుంటారు.

ఇలా ట్విన్స్గా జన్మించిన ఇద్దరు యువతులు తమ మాదిరిగానే ట్విన్స్ గా ఉన్న యువకులను భర్తగా కోరుకుంటే తప్పులేదుగానీ, కానీ ఈ ఇద్దరు ట్విన్స్ మాత్రం తమ రూటే సపరేటు అంటున్నారు. తమ అలవాట్లు, అలోచనల మాదిరిగానే తాము ఒక్కడే బాయ్ ఫ్రెండ్ తో స్నేహం చేయాలని భావిస్తున్నారు. అదేంటీ విచిత్రం అంటున్నారు. నిజంగానే ఇది విచిత్రం. ఒక్కడినే ఇద్దరు బాయ్ ఫ్రెండ్గా, భర్తగా పొందాలని కోరుకుంటే ఎలా అనిపిస్తుంది. పిచ్చి ముదిరి పాకన పడిందని అనుకోము.

ఆస్ట్రేలియాకు చెందిన అన్నా, ల్యూసీ అనే ఇద్దరు ఒకే బాయ్ ఫ్రెండ్ను కొనసాగించాలని అనుకుంటున్నారు. అతడితోనే ఇద్దరు తల్లిగా మారాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా చెబుతూ 'మేం కారును, ఉద్యోగాన్ని, దుస్తులను పంచుకుంటున్నాం. అలాగే బాయ్ ఫ్రెండ్ ను కూడా పంచుకుంటాం. అతడితోనే ఇద్దరం తల్లులమవుతాం. ఎందుకంటే గతంలో మాకు చెరొక బాయ్ ఫ్రెండ్ వుండేవారు. కానీ, వారితో మాకు సర్దుబాటుకాలేదు. అందుకే మేం ఒకే బాయ్ ఫ్రెండ్ను కొనసాగించాలనుకుంటున్నాం' అని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles