India vs Pakistan World T20 Match Pakistan pick pace after slow start

Pakistan sets 119 runs target before india

world t20, world t20 updates, India, ind vs pak, world t20 news, world t20 scores, ms dhoni, ms dhoni captain, ms dhoni india, t20 world cup-2016, pakistan, ICC T20 WC, India vs pakistan, jasprit bumrah, mohammed shami, hardik pandya, yuvvraj, kohli, rohit sharma, cricket news, cricket

India need 119 runs to change the history of Eden Gardens. They have never beaten Pakistan in limited-overs game here.

భారత్ ముందు 119 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించిన పాక్

Posted: 03/19/2016 10:01 PM IST
Pakistan sets 119 runs target before india

వరల్డ్ టీ 20లో భాగంగా ఈడన్ గార్డన్ స్టేడియంలో జరుగుతున్న మెగా ఈవెంట్ గా అభివర్ణించబడిన దాయాధులు భారత్, పాక్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ముందు పాకిస్తాన్ 119 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. పిచ్ కండీషన్ తెలుసుకున్న పాకిస్తాన్ ఆది నుంచి ఆచితూచి బ్యాటింగ్ చేసింది. పాక్ ఓపెనర్లు షార్జిల్ ఖాన్(17), అహ్మద్ షెహజాద్(25) మోస్తరుగా రాణించినా, కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది (8) నిరాశపరిచాడు. ఒకానొక దశలో 60 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్.. షోయబ్ మాలిక్(26), ఉమర్ అక్మల్(22)ల చలవతో తేరుకుంది.
 
ఈ జోడి 41 పరుగుల  భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం ఉమర్ అక్మల్ నాల్గో వికెట్ గా అవుట్ కాగా, ఆపై కాసేపటికే మాలిక్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో పాకిస్తాన్ పరుగుల వేగం మందగించింది. ఇక చివర్లో సర్ఫరాజ్ అహ్మద్(8 నాటౌట్), మొహ్మద్ హఫీజ్ (5 నాటౌట్) లు పరుగులు చేయకుండా నియంత్రించడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు.  దీంతో పాకిస్తాన్ 18.0 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.  భారత బౌలర్లలో నెహ్రా, బూమ్రా, రైనా, జడేజా, పాండ్యాలకు తలో వికెట్ దక్కింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : t20 world cup-2016  India  pakistan  ICC T20 WC  India vs pakistan  

Other Articles