with house resolution can they hang me question mla roja

Ycp mla roja slams tdp government

Roja, Nagari, AP Assembly, AP Speaker, Kodela SivaPrasadRao, Chandrababu, High court, contempt of court, AP Assembly secretary, Ap assembly marshals, cheif marshal ganesh babu, ap assembly, mla roja suspension, rajbhavan

ycp mla RK Roja Questions govvernment, if ruling party takes up a resolution in the house to hang, will they hang me.

సభ తీర్మాణం చేస్తే నన్ను కూడా ఉరి తీస్తారా..? ప్రశ్నించిన రోజా

Posted: 03/18/2016 04:31 PM IST
Ycp mla roja slams tdp government

అసెంబ్లీ తీర్మాణ వ్యవహారాల్లో శాసనసభే న్యాయస్థానం కన్నా గొప్పదని భావించిన పక్షంలో.. తనను ఉరి తీయాలని అసెంబ్లీ తీర్మాణిస్తే.. నిజంగానే ఉరి తీస్తారా..? అని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నా తనను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకపోవడాన్ని అమె తీవ్రంగా పరిగణించి ఇవాళ ప్రజాస్వామ్యంలో బ్లాక్‌డేగా పరిగణిస్తున్నామన్నారు. మనమంతా రాజ్యాంగాన్ని గౌరవిస్తామని, మనకు ఎక్కడైనా అన్యాయం జరిగితే కోర్టులకు వెళ్తే న్యాయం జరుగుతుందని వెళ్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని, వాటిని మనం పాటించాలని అన్నారు. కానీ ఏపీ అసెంబ్లీ న్యాయవ్యవస్థను ధిక్కరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను కోర్టు ఉత్తర్వులను గురువారమే అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చానని, శుక్రవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీకి వస్తానని లేఖ కూడా ఇచ్చానని.. వాటిని తీసుకుని అందినట్లు అక్నాలెడ్జిమెంటు కూడా ఇచ్చారన్నారు. కానీ ఈరోజు మాత్రం మార్షల్స్‌తో తనను లోపలకు రానివ్వొద్దని చెప్పారని ఆమె తెలిపారు. చీఫ్ మార్షల్ గణేశ్ బాబు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. హైకోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా.. అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ చెప్పారంటూ అడ్డుకున్నారని తెలిపారు. న్యాయవ్యవస్థ కన్నా స్పీకర్ పదవి పెద్దది అనుకుంటున్నారని, అలాంటప్పుడు మరి కోర్టుకు ఎందుకు లాయర్లను పంపారు, ఎందుకు వాదనలు వినిపించారని ఆమె ప్రశ్నించారు.

ఇదే సందర్భంగా టీడీపీ నేతలపై అమె పలు విమర్శలు చేశారు. జూబ్లీహిల్స్ లో టీచర్ ను కారులోకి లాగిన రావెల సుశీల్ తండ్రి కిశోర్ బాబు అసెంబ్లీలో కూర్చోడానికి అర్హుడా, ప్రభుత్వ అధికారుల విధుల నిర్వహణకు అడ్డుపడిన చింతమనేని ప్రభాకర్ అసెంబ్లీలో కూర్చోవచ్చా? కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో నిందితులైన బుద్దా వెంకన్న లాంటివాళ్లు మండలిలో ఉండొచ్చా అని రోజా సూటిగా ప్రశ్నించారు. చివరకు ఎమ్మెల్యే అయ్యానన్న అహంకారంతో టీచర్‌ని చెప్పు తీసుకుని కొట్టిన అనిత కూడా సభలో ఉన్నారని రోజా అన్నారు.

రాష్ట్రంలో ఉన్న మహిళల సమస్యలు, తన నియోజకవర్గ సమస్యలపై పోరాడుతుంటే తన నోరు నొక్కేయడానికి ప్రయత్నించారని రోజా చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో బోండా ఉమా, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, సాక్షత్తు చంద్రబాబు అనేక అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడారని.. కానీ తాను అలా ఏమీ మాట్లాడకపోయినా వాళ్ల ఇష్టానికి మాటలు రాసేసుకుని శిక్షలు వేసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.  వీళ్లకు ప్రజాస్వామ్యం మీద గానీ, కోర్టుల మీద గానీ గౌరవం లేదన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Roja  Nagari  AP Assembly  AP Speaker  Kodela SivaPrasadRao  Chandrababu  

Other Articles