Trisha faces netzens irk for slaming BJP MLA Ganesh Joshi

Trisha slams bjp mla ganesh joshi for beating up horse

Trisha Krishnan,trisha,BJP MLA,ganesh joshi,mla ganesh joshi, police horse shaktimaan, horse beating episode,horse assault,nayaki,nayagi,trisha next movie, bjp mla ganesh joshi, police horse, shaktimaan, peta

Actress and animal lover Trisha Krishnan faces netzens irk after expressing her anger over the assault of a horse allegedly by Bharatiya Janata Party (BJP) MLA Ganesh Joshi.

నటి త్రిషపై మండిపడుతున్న నెటిజనులు

Posted: 03/18/2016 10:31 AM IST
Trisha slams bjp mla ganesh joshi for beating up horse

దక్షిణాది సినీనటి త్రిషపై సోషల్ మీడియా కారాలు మిరియాలు నూరుతోంది. అదేంటి అమె సినిమా నటి కదా.., అమెకు నెటిజన్లకు మద్య ఎం జరిగింది అనుకుంటున్నారా..? అమెపై ఆగ్రహానికి స్వయంకృపారాధమే అంటున్నారు.  అందరితో పాటు పలు మీడియాలలో వచ్చిన వార్తలను నిజమని నమ్మిన అమె అంతే తొందరపాటులో ఓ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అంతే దీంతో అమెను కొందరు మెచ్చుకున్నా.. మరికోందరు మాత్రం తిట్టుకుంటున్నారు. ఇంకోందరు అమెపై మండిపడుతున్నారు.

విషయంలోకి వెళ్తే.. గత మూడు రోజుల క్రితం ఉత్తరాఖండ్ లో బీజేపి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమాలలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు గుర్రం శక్తిమాన్ కాలు విరిగింది. ముసోరి గణేశ్ జోషి అనే ఓ బిజేపి శాసనసభ్యుడు పోలీసు నుంచి లాఠి లాక్కుని గుర్రాన్ని చితక బాదారు. ఆ సంఘటన దృశ్యాలు మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ అభియోగాలను నమ్మిన త్రిష నమ్మేసింది. తన మనస్సలో మాటను సోషల్ మీడియాలో పెట్టేసింది. అంతే ఇక అమె తనకు వస్తున్న మేసేజ్ లను చూసి విస్మయం వ్యక్తం చేయాల్సి వచ్చింది.

అయితే మూగజీవాల ప్రేమికురాలైన అమె మూగ ప్రాణుల సంరక్షణ  సంస్థ పేటాకు తన వంతు సేవలను అందిస్తుంది. పెటా ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ మూగ జీవి బాధింపునకు గురైనా టనే స్పందిస్తుంటారు. అదే విధంగా ఇటీవల ఉత్తరాఖండ్‌లో రాజకీయ వాదుల గొడవల్లో ఒక గుర్రం తీవ్రంగా గాయపడటంపై కూడా స్పందించింది. దీంతో ఈ అంశంపై నిజానిజాలు నిర్థారణ చేసుకోకుండా అమె స్పందించిన తీరుపై నెటిజనులు మండిపడతున్నారు. గుర్రాన్ని రక్తం కళ్ల చూసిన ఆ శాసన సభ్యుడిని ఉద్దేశిస్తూ మిమ్మల్ని నరకంలో కాల్చాలి అని తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
దీనికి కొందరు త్రిషకు మద్దతు పలికినా మరి కొందరు ఆరోపణలు గుప్పించడం గమనార్హం. గుర్రం కాలికి తగిలిన దెబ్బలపై స్పందించిన త్రిష కులమతాల పేరుతో జరుగుతున్న హత్యలపై గొంతెత్తడం లేదు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఆ మధ్య జల్లికట్టుపై త్రిష నోరు మెదపలేదేం అంటూ చురకలు వేస్తున్నారు. మరొకరైతే ఇలాంటి ఖండన వల్ల త్రిషకు మూగ జీవాల సంరక్షణ సంస్థ నుంచి మంచి ఆదాయం అందుతోందని ఆరోపించారు. అయితే ఆమె మానవతా దృక్పథాన్నా అభినందించేవారు లేక పోలేదు. మరి ఈ చెన్నై సుందరి నెటిజన్ల ఎలా బదులిస్తారో చూడాలి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  bjp mla ganesh joshi  police horse  shaktimaan  peta  

Other Articles