governor slams yadadri temple official for late in swami kalyanam

Governor narasimhan fires on yadadri authorities

governor fires on temple EO, governor narasimhan, yadadri temple EO geeta reddy, yadagiri gutta bramhostavam, swami kalyanam, yadagiri gutta, lakshmi narasimha swamy kalyanam, governor, narasimhan, geetareddy

governor esl narasimhan slams yadadri temple executive officer geeta reddy and other officials for not performing swami kalyanam in time

స్వామి వారి కళ్యాణమా..? లేక మీ ఇంట్లో కళ్యాణమా..? మండిపడ్డ గవర్నర్

Posted: 03/18/2016 12:15 PM IST
Governor narasimhan fires on yadadri authorities

ఒక వైపు ఉభయ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా బాధ్యతాయుత పదవులలో కొనసాగుతూ తన విధులు నిర్వహిస్తూ.. అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. ఇక మరోవైపు అచెంచలమైన దైవభక్తికి ఆయన నిలువెత్తు నిదర్శనం. హైందవ సంప్రదాయాల ప్రకారం తన ఒంటిపై కండువాను కప్పుకుని మాత్రమే ఆలయాల్లోకి ప్రవేశించి దైవదర్శనం చేసుకుంటారు. రాష్ట్రపతి, ప్రధాని, ఇలా ఎవరు వచ్చినా.. ఆయన వారి వెంట ఉంటూనే తన సంప్రదాయాలను మాత్రం మరువరు. అయనే గవర్నర్ నరసింహన్.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి సతీసమేతంగా నిన్న రాత్రి హాజరైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆలయ అధికారులపై అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు సతీసమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. యాదగిరీశుడి కల్యాణం నిర్ధేశిత ముహూర్త సమయాని కన్నా ఆలస్యంగా జరుగుతుందన్న కారణంతో ఆయన ఆలయ అధికారులపై మండిపడ్డారు.  రాత్రి 8:30 గంటల సమయానికి సతీసమేతంగా యాదాద్రికి వచ్చిన గవర్నర్ దంపతులు.. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు.

అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు సమాచారం. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందని, అందుకే పావుగంట ఆలస్యంగా కల్యాణం నిర్వహిస్తున్నామని ఈవో బదులివ్వడంపై గవర్నర్ అగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఇది స్వామి వారి కళ్యాణం అనుకుంటున్నారా..? లేక మీ ఇంట్లో వివాహం అనుకుంటున్నారా..? అని నిలదీశారు.

స్వామి వారి కల్యాణానికి నిర్ణయించి ముహూర్తాన్ని.. ఎవరో రావాలన్న ఆలోచనతో ఆలస్యంగా చేస్తున్నారనే కారణంతో నరసింహన్ తన సతీమణితో కలిసి 10:45 గంటల సమయంలో కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లే సమయానికి మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా పూర్తి కాకపోవడం, పెళ్లికి వచ్చిన దుస్తులతోనే ఆయన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. రాయగిరి కట్ట మీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనశ్రేణిని ఆపిన గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని హైదరాబాద్ వెళ్లారని సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yadagiri gutta  lakshmi narasimha swamy kalyanam  governor  narasimhan  geetareddy  

Other Articles