We need ashwakhulla khan type Indians not like asaduddin owisi

We need ashwakhulla khan type indians not like asaduddin owisi

Asaduddin owisi, owisi, Asaduddin, Asaduddin about Bharath matha slogan

We need ashwakhulla khan type Indians not like asaduddin owisi. True Indian Muslims will die for India. but some like Asaduddin blaming the whole community.

భారత్ కు కావాల్సింది అసదుద్దీన్ కాదు... అష్వాఖుల్లా ఖాన్

Posted: 03/18/2016 09:58 AM IST
We need ashwakhulla khan type indians not like asaduddin owisi

భారత్ మాతకు జై అని అనను.. నా గొంతు మీద కత్తి పెట్టినా కూడా నేను ఆ మాట అనను అని ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారాన్ని రేపాయి. దేశంలో దేశభక్తి గురించి లేని వివాదాలు రగుతున్న సమయంలో, పలు రాఫ్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న టైంలో అసదుద్దీన్ లాంటి వ్యక్తి ఈ రకమైన ప్రకటన చెయ్యడం నిజంగా ఆశ్యర్యమే. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా భారత్ మాతకు జై అని అనాలని రాయలేదని అసదుద్దీన్ తన వ్యాఖ్యల్లో వెల్లడించారు. అయితే దానికి పార్లమెంట్ సాక్షిగా జావేద్ అక్తర్ గట్టి సమాధానమిచ్చారు. అదే బారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా టోపీ పెట్టుకోవాలని, కుర్తా వేసుకోవాలని కూడా లేదని ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలా దేశంలో కొత్త వివాదానికి తెర తీసి.. ముస్లిం వర్గాన్ని ప్రబావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

గత దఫా ఎన్నికల్లో చాలా రాష్ట్రాల నుండి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ముస్లింలకు అధిక ప్రాదాన్యతనిస్తున్న పార్టీగా ముస్లిం వర్గంలో ఎంఐఎం కు గుర్తింపు ఉంది. అయితే దీని మీదే పూర్తి దృష్టిసారించిన అసదుద్దీన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే బారతమాతకు జై అనాలా వద్దా అన్నది పక్కన బెడితే అసదుద్దీన్ లాంటి రెచ్చగొట్టే వాళ్లు మనకు అవసరమా,, దేశానికి ఎంత వరకు అవసరం అన్న అంశం ఆలోచించాలి. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా ప్రాణాలు తియ్యడానికైనా సిద్దంగా ఉన్న ఎంతొ మంది ముస్లింలు మన దేశంలో ఉన్నారు. దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. కానీ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వ్యక్తులకు మాత్రం మనుషులు అంటే కేవలం మా మతం వాళ్లు మాత్రమే అనే బావనలో బ్రతికేస్తున్నారు. దౌర్భగ్యం ఏంటంటే ఏ భారత రాజ్యాంగంలో అయితే బారత మాతకు జై అని రాయలేదో.. అదే బారత రాజ్యాంగం మూలానా పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడుతున్నారు ఓవైసీ.

బారత్ లో ముస్లింలు ఎన్నడూ కూడా తమకు ఇక్కడ భద్రత లేదు అని కానీ.. ఇది తమ ప్రాంతం కాదు అని కానీ ఆలోచించలేదు. కానీ ఓవైసీ లాంటి కొంత మంది రాజకీయ ఉగ్రవాదులు మాత్రం వారిలో లేని భయాలను కలిగిస్తున్నారు. పార్లమెంట్ లో ఎప్పుడూ ముస్లింల గురించి మాట్లాడే ఓవైసీ తన తమ్ముడు అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యల మీద మాత్రం స్పందించరు. ఏమైనా మాట్లాడితే మాత్రం భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ అంటూ తప్పించుకుుంటున్నారు.

దేశానికి నిజంగా అక్బరుద్దీన్ ఓవైసీలాంటి వాళ్లు అస్సలు అవసరం లేదు. మన దేశం కోసం బ్రతికి, మన దేశం కోసం చనిపోయిన అష్వాఖుల్లా ఖాన్ లాంటి నిజమైనా బారతీయుడు కావాలి.

* దేశం కోసం ఎన్ని సార్లైనా చావడానికి నేను సిద్దంగా ఉన్నాను కానీ ఒక్కటే ప్రార్థన నన్ను మళ్లీ మళ్లీ ఇదే దేశంలో పుట్టించు దేవుడా- అష్వఖుల్లా ఖాన్
* భారత్ మాతాకి జై అని అనను, గొంతు మీద కత్తి పెట్టినా కూడా ఆ మాట అనను- అసదుద్దీన్ ఓవైసీ

* నేను దేని గురించైతే పోరాడుతున్నానో(బారత స్వాతంత్ర్యం) అది నా తరువాతి తరాలు కూడా చెయ్యకూడుద అని అనుకుంటున్నాను- అష్వాఖుల్లా ఖాన్
* ఆర్మీకి సంబందించిన వాటిని అగ్ని, ఆకాశ్, అర్జున్ అని కావాలని హిందు పేర్లు పెడుతోంది- అసదుద్దీన్ ఓవైసీ

* దేశం కోసం చచ్చే, చంపే అష్వఖుల్లా ఖాన్ లాంటి నిజమైన బారత ముస్లిం కావాలే తప్ప.. అసదుద్దీన్ లాంటి పనికిమాలిన, రెచ్చగొట్టే నాయకుడు మాత్రం అక్కర్లేదు. బారతదేశంలో హిందు, ముస్లిం బాయ్ * బాయ్ అని ఉంది కానీ కాదు కాదు ముస్లింలు వేరే, హిందువులు వేరే అన్న బావన అసదుద్దీన్ లాంటి వాళ్ల కలిగేలా ఉంది.

దేశం కోసం ప్రానాలు విడిచిన అష్వఖుల్లా ఖాన్ చెప్పిన మాటలు ఒక్కసారి చూడండి. ‘‘ రాంప్రసాద్ బిస్మిల్్ హిందు.. ఆయన అంటారు మళ్లీ వస్తా.. మ
ళ్లీ వస్తా.. భారత్ కు విముక్తి కలిగించేందుకు మళ్లీ వస్తా. నేను ముస్లింను.. మరో జన్మ గురించి నమ్మను కానీ దేవుడు నిజంగా నాకు అవకాశం ఇస్తే స్వర్గానికి బదులు నా దేశంలో మరో పునర్జన్మను కోరుకుంటా. 



నిజాలు తెలుసుకో అసదుద్దీన్ ఓవైసీ
* దిల్లీ జె.ఎన్.యులో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మాట వాస్తవం. అప్ఘల్ గురును పొగిడింది నిజం. ఆ నేపథ్యంలో మోహన్ భగత్ దేశ యువతకు దేశభక్తి నింపాల్సిన అవసరం ఉందని.. అందుకు భారత్ మాతాకి జై అని నినాదాలు ఇప్పించాలని సూచించాడు. అంతే కానీ ఖచ్చితంగా పాడాల్సిందే అని ఎక్కడా చెప్పలేదు.
* ఎన్నికల నేపధ్యంలో ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ ఆ మాటలు ఎంత ప్రబావం చూపుతాయో మాత్రం అర్థం చేసుకోవడం లేదు.
* భారత మాత అంటే ఎందుకు అసదుద్దీన్ ఓవైసీకి ఇష్టంలేదు. ఓ ఎంపీనే ఇలా అంటే మరి మామూలు వ్యక్తులు ఏమనాలి...?
* భారత్ మాతాకి జై అని బారత్ లో కాకుండా వేరే  ఏ దేశంలో అంటారు..? అని ప్రశ్నించిన స్మృతి ఇరానీకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
* ఐసిస్ లో బారతీయ ముస్లింలు ఎవరూ చేరవద్దు అని అంటూనే. ఓ ఎంపీగా ఐసిస్ మీదకు బారత సైన్యాన్ని పంపొద్దు అని అంటారా..? ఇదంతా ఏంటి మరి రెచ్చగొట్టడం కాదా..?
* భారతమాతాకు జై అని అనను అన్న అసదుద్దీన్.. తన వ్యాఖ్యలపై పెట్టిన కేసులపై స్పందిస్తూ మాత్రం కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది అని అంటూ చివర్లో జైహింద్ అని అన్నారు. మరి జైహింద్ అని ఎందుకు అనాల్సి వచ్చిందో..?
* అసదుద్దీన్ ఓవైసీ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ వేరే మతానికి చెందిన దేవత గురించి పిచ్చి కూతలు కూస్తే కనీసం నోరు తెరిచి తప్పు అని చెప్పలేదు. అదే అసదుద్దీన్ మతం గురించి మాట్లాడి ఉంటే ఊరికే ఉండే వాళ్లా..?
* ఆర్ఎస్ఎస్, వి.హెచ్.పి, బిజెపి అంటే ద్వేషం ఉండవచ్చు.. అందుకు ఏమన్నా మాట్లాడవచ్చు కానీ దేశభక్తికి సంబందించిన అంశంలొ మాత్రం నోరు జారకూడదు.

చివర్లో: అసదుద్దీన్ ఓవైసీ అన్నట్లు బారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బారత్ మాతాకి జై అని అనాలని రాయలేదు.. కానీ ఇలాంటి మహానుబావుల వల్ల రాజ్యాంగాన్ని సవరించి.. ప్రతి ఒక్కరు బారత్ మాతాకి జై అని అనాలి అని సవరణ చెయ్యాల్సి వస్తుందేమో..!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : Asaduddin owisi  owisi  Asaduddin  Asaduddin about Bharath matha slogan  

Other Articles