Shaktiman's fractured limb amputated, fitted with prosthetic leg

Shaktiman s leg amputated to save his life bjp worker held

BJP MLA, dehradun, leg amputated, Police horse, Shaktiman horse, police horse shaktimaan, brutal attack on shaktimaan, brutal attack on police horse, bjp worker held, shaktimaan,

Shaktiman, which was subjected to a brutal attack during a BJP protest, had his injured hind leg amputated in an emergency life-saving surgery today even as a party worker was arrested.

శక్తిమాన్ కృతిమ కాలు వచ్చింది.. లేచి నిలబడింది..

Posted: 03/18/2016 09:48 AM IST
Shaktiman s leg amputated to save his life bjp worker held

ప్రమాదం బారిన పడి శరీరంలోని పలు కాళ్లు, చేతులు వంటి అవయవాలు కోల్పోయిన వారికి వైద్యులు కృతిమ చేతులు, కాళ్లు ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆ శక్తిమాన్ విషయంలోనూ అదే చేశారు వైద్యులు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో బీజేపీ నిరసన కార్యక్రమంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న శక్తిమాన్ ను దానిపై నున్న పోలీసు కానిస్టేబుల్ ను లాగి కిందకు పడేసాడు ఓ బీజేపి కార్యకర్త. దీంతో అదుపు తప్పి పట్టు కోల్పోయిన శక్తిమాన్  అకస్మాత్తుగా కిందపటడంతో దాని కాలు తీవ్రంగా గాయపడింది.

దీంతో ఆ పోలీసు గుఱ్ఱం శక్తిమాన్ కు వైద్యులు కృత్రిమ కాలు అమర్చారు. ఇందుకోసం జరిగిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. గుర్రం లేచి తన కొత్త కాలుమీద నిలబడిందని, దాంతో ఆపరేషన్ విజయవంతం అయినట్లేనని దానికి ఆపేరషన్ చేసిన డాక్టర్ ఖంబాటా తెలిపారు. గుర్రం కాలు తీవ్రంగా గాయపడిందని దీంతో దానిని అలాగే ఉంచేస్తే గాంగరిన్ అనే రోగం కాలు నుంచి మొత్తం శరీరంలోకి వ్యాప్తి చెంది అది చనిపోయే ప్రమాదం ఉండటంతో కాలును అంతకుముందు తీసేశారు.

కాగా శక్తిమాన్ పై దాడి చేశారన్న అరోపణలను ఎదుర్కోంటున్న బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి దాన్ని సందర్శించారు. అయితే తాను అసలు దాన్ని కొట్టనే లేదని, మూగజీవి బాధపడుతోందన్న ఆవేదనతోనే ఇక్కడకు వచ్చానని ఆయన చెప్పారు. వాస్తవానికి గుర్రం తీవ్రంగా గాయపడిన దృశ్యాల్లో ఎమ్మెల్యే జోషి కర్రతో ఉన్నట్లు కనిపించడంతో ఆయనపై అరోపణలు వచ్చాయి. అయితే వీడియో ఫూటేజీలో మాత్రం మరో బిజేపీ కార్యకర్త శక్తిమాన్ మీద పోలీసు స్వారీ చేస్తుండగా దాని కళ్లెం పట్టుకుని లాగేశాడు. ఫూటేజీ అధారంగా ఆ కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP MLA  dehradun  leg amputated  Police horse  Shaktiman  

Other Articles