No Entry | Roja | Assembly | TDP Party | Govt

No entry to roja in assembly

No Entry to Roja in Assembly, No Entry to Roja, Roja at assembly, Roja comments on Yanamala, Roja latest interview, YCP MLA Roja latest updates, Roja stills

No Entry to Roja in Assembly: YCP MLA Roja suspended from AP Assembly for a year. YCP MLA Roja re entry in Assembly after One Year suspension.

సభలోకి రోజాకు నో ఎంట్రీ

Posted: 03/18/2016 09:40 AM IST
No entry to roja in assembly

వైసీపి ఎమ్మెల్యే రోజా టిడిపి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రోజా సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిసేపటి క్రితమే లాయర్లతో కలిసి అసెంబ్లీకి వచ్చిన రోజాను పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. ఈ సంధర్భంగా కాసేపు రోజా అనుచరులు మరియు పోలీసులకు మధ్య వాగ్వాదం ఏర్పడింది. ఆ తర్వాత కొద్దిసేపటికి రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించిన పోలీసులు సభలోకి మాత్రం అనుమతించలేదు.

ఈ క్రమంలో మీడియాతో రోజా మాట్లాడుతూ... తనను సస్పెండ్ చేస్తూ మంత్రి యనమాల రామకృష్ణుడు ప్రతిపాదించిన తీర్మాణం ఆవేశపూరితంగా తీసుకున్నదేనని ఆమె తేల్చేసారు. కోర్టు తీర్పుతో ఆవేశంలో తీసుకున్న సదరు నిర్ణయాన్ని సరిచేసుకునే అవకాశం ప్రభుత్వానికి వుందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే కోర్టు తీర్పును ప్రభుత్వం ధిక్కరిస్తుందని, తనను సభలోకి అనుమతించకుండా అడ్డుకుంటున్నారని రోజా మండిపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No Entry  YCP MLA Roja  Assembly  TDP Govt  Yanamala  

Other Articles