TV anchor Nirosha commits suicide in Secunderabad

Music channel anchor nirosha commits suicide

anchor suicide, music channel anchor, nirosha, suicide, secundrabad, sindhi colony, love affair, nirosha engagement, nirosha marriage, K. Nirosha, Gemini Music TV, anchor nirosha suicide

A 23-year-old Telugu music television anchor K. Nirosha was found dead in her PG hostel in Secunderabad in the early morning hours.

టీవీ యాంకర్ ఆత్మహ్యత.. ప్రేమ వ్యవహారమే కారణం..

Posted: 03/16/2016 11:35 AM IST
Music channel anchor nirosha commits suicide

రెండు అక్షరాల ప్రేమ నిండు నూరేళ్ల జీవితాలను మధ్యలోనే బలితీసుకుంటున్న ఘటనలు అనేుకం జరుగుతున్నాయి. పెద్దలు అంగీకరించలేదని యువజంటలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజూ చూస్తూనే వున్నాం. అయితే వన్ సైడ్ ప్రేమ వ్యవహరం బెడిసి కోట్టిందో.. లేక ప్రియుడు అన్యాయం చేశాడో.. లేక పెద్దలు కుదర్చిన వివాహం ఇష్టంలేకనో మరో నిండు నూరేళ్ల జీవితం బలైయ్యింది. తెలుగు మ్యూజిక్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్న నిరోషా అనే యువతి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది.

 సికింద్రాబాద్ లోనిలో సింధీకాలనీలోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఆమె.. ఓ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రేమ వ్యవహారమే ఆమె చావుకు కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు నెల రోజుల్లోనే పెళ్లి కావాల్సి ఉంది. ఇప్పటికే ఎంగేజిమెంట్ కూడా అయ్యింది. ఆమె వీడియో కాల్ మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. దాంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి.. కాల్ పెట్టేసిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

 అయితే.. నెల రోజుల్లోనే పెళ్లి జరగాల్సి ఉండగా ఇప్పుడు ఎందుకు తిరస్కరించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎంగేజిమెంట్ అయిన వ్యక్తితో ఏం మాట్లాడిందని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరోషా స్వస్థలం చిత్తూరు జిల్లా సోమల మండలం మల్లేశ్వరపురం గ్రామం. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న రాంగోపాల్‌పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles