SC accords urgent hearing of plea on appointments of CVC and VC

Cvc must be sent to jail jethmalani

Ram Jethmalani,CVC,Central Vigilance Commissioner, Central Vigilance Commissioner KV Chaudhary Vigilance Commissioner TM Bhasin TS Thakur

Former law minister and BJP-baiter Ram Jethmalani on Tuesday sought urgent hearing of his petition challenging the appointment of K V Chowdary as central vigilance commissioner and said the "NDA government has appointed a person as CVC who must be jailed".

జైల్లో పెట్టాల్సిన వ్యక్తిని సీవీసీని చేస్తారా..? రామ్ జెఠ్మాలనీ

Posted: 03/16/2016 10:01 AM IST
Cvc must be sent to jail jethmalani

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వంపై ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ తీవ్రంగా మండిపడ్డారు. జైలుకు వెళ్లాల్సిన వ్యక్తిని ఎన్డీయే ప్రభుత్వం ప్రధాన విజిలెన్స్ కమిషనర్‌గా నియమించిందంటూ కేంద్ర న్యాయశాఖ మాజీమంత్రి రామ్ జెఠ్మలానీ మండిపడ్డారు. కేవీ చౌదరిని సీవీసీగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, జెఠ్మలానీ వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.

 ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్‌తో కూడిన సర్వోన్నత సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రాంజెఠ్మలానీ వ్యాఖ్యలపై ప్రశ్నలను కురిపించింది. ''జైల్లో ఉన్న చాలామంది ఖైదీల తరఫున మీరు వాదించి, వాళ్లను బయటకు పంపాలని కోరుతారు, ఇప్పుడు మీరు ఓ వ్యక్తిని జైలుకు పంపాలని అడుగుతున్నారా..'' అని ప్రశ్నించారు. న్యాయస్థానం నుంచి ఈ ప్రశ్నలు వినిపించగానే రాంజెఠ్మలానీ కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

అయితే.. ''ఇప్పటికైనా నేను మారినందుకు మీరు నన్ను ప్రశంసించాలి'' అని దానికి జెఠ్మలానీ సమాధానమిచ్చారు. సీవీసీ నియామకం కేసు విచారణను ధర్మాసనం ఈనెల 29వ తేదీకి వాయిదా వేసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మాజీ అదినేత కేవీ చౌదరిని సీవీసీగాను, ఇండియన్ బ్యాంకు మాజీ సీఎండీ టీఎం భాసిన్‌ను విజిలెన్స్ కమిషనర్‌గాను నియమించడాన్ని 'కామన్ కాజ్' అనే స్వచ్ఛంద సంస్థ సవాలు చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Jethmalani  CVC  Central Vigilance Commissioner  

Other Articles