Over 100,000 units Galaxy S7 series sold in first two days

Over 1 lakh units samsung galaxy s7 sold in first two days

Over 100, 000 units Galaxy S7 series sold in first two days, Samsung Electronics Co, Galaxy S7, Galaxy S7 Edge, South Korean market,

More than 100,000 units of Samsung Electronics Co.'s Galaxy S7 series smartphones were sold in South Korea within the first two days of its official launch, data showed on Sunday

రెండు రోజుల్లో లక్ష ఫోన్ల అమ్మకాలు.. క్రేజ్ పెంచుతున్న గెలాక్సీ ఎస్ 7

Posted: 03/13/2016 07:09 PM IST
Over 1 lakh units samsung galaxy s7 sold in first two days

దక్షిణ కొరియా మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ శాంసంగ్ తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్లు కేవలం రెండు రోజుల్లోనే లక్షకు పైగా అమ్ముడుపోయాయని సంస్థ తెలిపింది. గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ హ్యాండ్ సెట్స్ శుక్రవారం 60 వేలు, శనివారం 40 వేలకు పైగా విక్రయాలు జరిగాయని ఓ అధికారిక సైట్ లో వివరాలు అప్ డేట్ చేశారు. ఈ రెండు రకాల హ్యాండ్ సెట్స్ గత నెలలో స్పెయిన్ లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఈ మొబైల్స్ పై స్మార్ట్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఈ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

గెలాక్సీ ఎస్7 ధర రూ.48,900 ఉండగా, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900 లతో శాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్లను మంగళవారం భారత మార్కెట్‌లోకి ఆ కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్లు 32 జీబీ, 64 జీబీ అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో ఉండనున్నాయి. ఇవి వాటర్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కలిగి ఉన్నాయి. మార్చి 8-18 మధ్యకాలంలో ప్రి-బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు కంపెనీ వర్చువల్ రియాలిటీ(వీఆర్)ను ఉచితంగా అందిస్తోంది. కాగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ఓపెన్ మార్కెట్‌లో మార్చి 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Galaxy S7  samsung  Galaxy S7 Edge  smartphone  

Other Articles