Vijay Mallya has blessings of Modi govt, won't return: Congress

Vijay mallya says time is not right for him to return to india

Vijay Mallya, Arvind Kejriwal, Kingfisher Airlines, Narendra Modi, Delhi, Congress spokesperson, Tom Vadakkan Aam Aadmi Party, Enforcement Directorate, Kingfisher Airlines, CBI, wilful defaulter

Slamming the Centre for letting Vijay Mallya escape with money of Indian citizens, Congress said the businessman would never return, as he has with him blessings of the Modi Government.

ఇప్పట్లో భారత్ వెళ్లను.. రుణాలిచ్చే బ్యాంకులకు రిస్క్ లు తెలియవా.? విజయ్ మాల్యా

Posted: 03/13/2016 03:54 PM IST
Vijay mallya says time is not right for him to return to india

ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తన విలాసాల కోసం వ్యాపారాలు అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోవడంపై ఆయనకు మద్దతుగా నిలిచిన నేతల, ప్రముఖలకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చెంపపెట్టులాంటివి. దేశంలోని ప్రజాధానాన్ని ఎగవేసినా.. ఆయన కర్ణాటక బిడ్డని, దేశం వదిలిపోడని ఒకరు, ఆయన ఉత్తమ వ్యాపారి అని మరోక నేత వెనకేసుకువచ్చిన నేపథ్యంలో ఆయన మాత్రం ఇప్పట్లో భారత్ కు వెళ్లలని తెగేసి చెప్పారు,

తనపై ఇప్పటికే ఓ నేరగాడన్న ముద్ర భారత్ లో పడిందని, అందువల్ల తాను తిరిగి భారత్ కు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని భావిస్తున్నానని దేశాన్ని విడిచి పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా తెగేసి చెప్పాడు. ప్రస్తుతం లండన్ లో ఉన్న మాల్యా 'సండే గార్డియన్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనపై గత సంవత్సరం లుకౌట్ నోటీసు జారీ అయిందని. తానేమీ పారిపోలేదని. ఇప్పుడు తనన్నో క్రిమినల్ గా ఎందుకు చిత్రిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రుణాలు తీర్చలేకపోవడం వ్యాపారంలో భాగంమన్నారు.

అంతేకాదు బ్యాంకులు రుణాలు ఇచ్చినప్పుడే, వాటికి రిస్క్ గురించి కూడా తెలుసునని, ఇప్పుడు తనను ఎగవేత దారుడని, అర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరించడం సమంజసం కాదన్నారు. తన సొంత వ్యాపారం నాశనమైందని అన్నారు. తనను ఓ విలన్ గా చూడొద్దని అన్నారు. మొత్తం విషయంలో పెద్ద బాధితుడిని తానేనని, తనకు ఇండియా వెళ్లాలని వున్నా, తన వాదన వినిపించేందుకు పారదర్శకమైన అవకాశం లభించదని భావిస్తున్నానని అన్నారు.

తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని స్పష్టం చేయలేనని సండే గార్డియన్ కు ఇచ్చిన ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో తెలిపారు. యూకేలో సైతం తనను మీడియా వెంటాడుతోందని, తాను మీడియాతో మాట్లాడబోనని తెలిపారు. కాగా మాల్యా ఇక దేశంలోకి రాడని తమకు ముందుగానే తెలుసునని కాంగ్రెస్ విమర్శించింది. మాల్యాకు కవచంలా వున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. ఆయనను సరక్షితంగా దేశం తీరాలను దాటించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ అరోపించారు.    

 మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  Narendra Modi  Congress  Tom Vadakkan  CBI  wilful defaulter  

Other Articles