2 Jailed for Driving Without Licence

2 jailed for driving without licence

Hyderabad, Traffic, Police, Driving Licence, Helmet, Traffic police

After sending scores of motorists behind bars for drunken driving, a local court, for the first time ever, has sent two persons to a day’s imprisonment after they ewere charge-sheeted for driving repeatedly without a valid driving licence. The Nampally court on Friday pronounced an autorickshaw driver, Yedukondalu, and a student, Ismail, guilty of violating the rules and sentenced them to one-day imprisonment.

హైదరాబాద్ లో లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినందుకు జైలు

Posted: 03/12/2016 08:36 AM IST
2 jailed for driving without licence

ట్రాఫిక్ రూల్స్ పాటించండి.. అంటూ ప్రభుత్వం ఎంత బాగా ప్రచారం చేస్తున్నా కానీ చాలా మంది వినడం లేదు. అలాంటి వారి కోసం పోలీసులు మంచి బుద్ది చెబుతున్నారు. ‘లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే జైలుకే’ అంటూ చాలా రోజులుగా హెచ్చరిస్తున్న పోలీసులు ఇక చర్యలకు దిగారు. ఒకటి, రెండు సార్లు చెప్పినా పట్టించుకోకుండా మూడోసారి కూడా లైసెన్స్ లేకుండా దొరికిన వాహనదారులకు జైలు బాటపట్టించారు హైదరాబాద్ పోలీసులు. మొత్తానికి నిన్నటి దాకా హెచ్చరికల దాకా వెళ్లిన పోలీసులు ఇక మీదట జైలుకు దారి కూడా చూపిస్తున్నారు. హెల్మెట్, లైసెన్స్ లేకుండా బయటకు వెళితే ఏం జరుగుతుందో వాహనదారులకు చూపించారు.

మలక్‌పేటకు చెందిన ఆటో డ్రైవర్‌ ఏడుకొండలు డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా మార్చి 5న మొట్టమొదటిసారి నాంపల్లిలో పట్టుబడ్డాడు. దాంతో పోలీసులు చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు పని వేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలోనే ఉండాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. అయినా, లైసెన్స్‌ తీసుకోని ఏడుకొండలు శనివారం రెండోసారి పోలీసులకు దొరికిపోయాడు. అతడిని పోలీసులు మళ్లీ నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష విధించింది. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే, డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా మోటారు సైకిల్‌ నడుపుతూ మూడోసారి పట్టుబడిన మీర్‌చౌక్‌కి చెందిన ఇస్మాయిల్‌కు కూడా కోర్టు ఒకరోజు జైలుశిక్ష విధించింది. ఇస్మాయిల్‌ మొదటిసారి పట్టుబడినప్పుడు పోలీసులు జరిమానా విధించారు. రెండోసారి కోర్టులో హాజరపర్చగా, పనివేళలు ముగిసే వరకు కోర్టు ఆవరణలోనే ఉండాలని ఆదేశించింది. శనివారం మూడోసారి పట్టుబడటంతో జడ్జి ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Traffic  Police  Driving Licence  Helmet  Traffic police  

Other Articles