If we keep criticising ourselves, why would the world look at us?

If we keep criticising ourselves why would the world look at us

Modi, Ravi shankar, Sri Sri Ravishankar, World Culture Festival, Delhi, Narendra Modi

Reacting to the controversy surrounding the three-day World Culture Festival in Delhi, Prime Minister Narendra Modi, speaking at the event, said, “If we keep criticising ourselves, why would the world look at us?”

భారత్ ది గొప్ప సంస్కృతిక వారసత్వం

Posted: 03/12/2016 08:10 AM IST
If we keep criticising ourselves why would the world look at us

ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా భారత్ కు గుర్తింపు తెచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన మోదీ, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ ద్వారా రవిశంకర్‌ 35 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారన్నారు. భిన్న సంస్కృతులు కలిగిన భారత్ ప్రపంచానికి ఎంతో ఇచ్చిందని మోడీ అన్నారు.150 దేశాల నుంచి ఈ వేడుకలకు తరలి వచ్చిన అతిథులకు, కళాకారులకు మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవాన్ని చూస్తుంటే కుంభమేళను తలపిస్తోందని ఇంతటి ఘనమైన ఏర్పాట్లను చేసిన నిర్వాహకులను ప్రధాని అభినందించారు.

భారత్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉందని... దానిని ప్రపంచమంతా కావాలనుకుంటున్నదిని మోదీ వెల్లడించారు. ఈ తరుణంలో మనల్ని మనం తక్కువ చేసుకుంటే, ప్రతి అంశాన్నీ విమర్శిస్తూ ఉంటే మనదేశంవైపు ప్రపంచం ఎందుకు చూస్తుంది? మనకున్న విశిష్ట సంస్కృతిని చూసి మనం గర్వపడినప్పుడే అది సాధ్యమవుతుంది అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన శ్రీశ్రీ రవిశంకర్ అభినందనీయుడని.. ప్రపంచానికి భారతదేశాన్ని పరిచయం చేశాడు అని అన్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Ravi shankar  Sri Sri Ravishankar  World Culture Festival  Delhi  Narendra Modi  

Other Articles