Vijay Mallya said he had zero debt

Vijay mallya said he had zero debt

Vijay Malya,Malya, Kingfisher, Vijay malya escape, Rajyasabha, Parliament, banks, Debt

Kingfisher Owner Vijay Malya dont have any debt. In an affidavit filed in 2010, as he sought a second Rajya Sabha term, liquor baron Vijay Mallya said he had zero property and debt, listing as "nil" his loans from banks and financial institutions.

ఒక్క రూపాయి అప్పులేని విజయ్ మాల్యా

Posted: 03/12/2016 10:58 AM IST
Vijay mallya said he had zero debt

విజయ్ మాల్యా.. ఇప్పుడు దేశంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు. దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయల బకాయిలను ఎగ్గొట్టి దేశం వదిలి ప్రశాంతంగా వెళ్లిపోయిన బడాబాబు. విజయ్ మాల్యా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పును కావాలనే, ఉద్దేశపూర్వకంగానే ఎగ్గొట్టినట్లు బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. అయితే విజయ్ మాల్యా మాత్రం దర్జాగా లగ్జరీ క్లాస్ లో లండన్ కు వెళ్లిపోయారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని తర్వాత తీరిగ్గా ట్వీట్ చేశాడు. కానీ అంతకు ముందు మాత్రం విజయ్ మాల్యాకు ఒక్క రూపాయి కూడా అప్పులేదని తెలిసింది. అవును ప్రస్తుతం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు వెల్లడిస్తున్న బ్యాంకులు ఈ విషయం వింటే షాకవుతాయేమో.

యుబి అధినేత విజయ్ మాల్యాకు సొంత ఇల్లు లేదట. భూమి అసలే లేదట, చేతిలో కేవలం 9500 రూపాయల నగదు మాత్రమే ఉంది. ఆయన ఒక్క రుపాయి కూడా అప్పులేరు. ఫెర్రారీ కారు, బంగారు, బాండ్లు, డిపాజిట్లు ఇతర ఆస్తలున్నీ కలిపి ఆయనకు 615 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈ విషయాలన్నీ ఆయనే వెల్లడించారు. 2010లో రాజ్యసభకు పోటీచేసినపుడు మాల్యా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈ విషయాలు పొందుపరిచారు. అయితే మరి అప్పుడు 615 కోట్ల ఆస్తులు ఉన్న మాల్యా ఇప్పుడు మాత్రం తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు ఎలా చేశాడు అన్నదే బిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే అతడి ఆస్తుల విషయం ఎలా ఉన్నా ఈడీ మాత్రం ఆయనకు నోటీసులు జారీ చేసింది. మాల్యాను ఇండియాకు తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Malya  Malya  Kingfisher  Vijay malya escape  Rajyasabha  Parliament  banks  Debt  

Other Articles