AP plans expenditure of Rs. 1,35689 cr in 2016-2017

Ap plans expenditure of rs 1 35689 cr in 2016 2017

State Finance Minister Yanamala Ramakrishnudu, Andhra pradesh budget, budget 2016-17, chandrababu naidu, TDP Government, Non-Plan expenditure, Plan expenditure, AP BUDGET,

Finance Minister Yanamala Ramakrishnudu today in the Assembly, while the Non-Plan expenditure is pegged at Rs. 86,554 crore and the Plan expenditure is estimated to be Rs. 49,134 crore.

లక్ష 35 వేల 688 కోట్ల రూపాయలతో ఏపీ బడ్జెట్.. ఆర్థిక లోటు 20 వేల కోట్లకు పైనే..

Posted: 03/10/2016 12:41 PM IST
Ap plans expenditure of rs 1 35689 cr in 2016 2017

లక్షా 35 వేల 688 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్‌ 2016-17 బడ్జెట్‌ను ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం 49 వేల 134 కోట్ల రూపాయలు కాగా, ప్రణాళికేతర వ్యయంయ 86 వేల 554 కోట్ల రూపాయలుగా వుందని పేర్కోన్నారు. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం మేర ఈ ఏడాది బడ్జెట్ వృద్ధి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బడ్జెట్ లో రెవెన్యూ లోటు 4868 కోట్ల రూపాయలుగా వుండగా, అటు ఆర్థిక లోటు మాత్రం 20 వేల 497 కోట్ల రూపాయలు వుందన్నారు.

ఏపీ బడ్జెట్ ను పూర్తి పారదర్శకంగా తయారు చేశామని చెప్పిన ఆయన అన్ని మంత్రిత్వ శాఖల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తాను బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. ఈ ఏడాది వృద్ది రేటును 10.9గా లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నామని చెప్పిన యనమల.. పారిశ్రామిక రంగంలో 11.43, సేవారంగంలో 11.39, వ్యవసాయ రంగంలో 8.9 శాతం మేర వృద్ది రేటు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

తొలిసారిగా యనమల రామకృష్ణుడు ఈ-బడ్జెట్‌ను రూపొందించారు. ఈ-బడ్జెట్‌ కాపీలను ట్యాబ్స్‌ ద్వారా శాసనసభులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అబ్దుల్‌ కలాం సుభాషితంతో ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు రూ.4,785.14 కోట్లు కేటాయించిన యనమల, భూపరిపాలనకు రూ.3,119.72 కోట్ల రూపాయలను కేటాయించింది. అమరావతి నిర్మాణానికి 1500 కోట్లను, కాపులకు వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించింది. నదుల అనుసంధానికి పెద్దపీట వేస్తామని యనమల ప్రకటించారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..

* రాష్ట్ర సొంత ఆదాయం 16శాతం మేర పెరిగింది.
* 2014-15 రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.3వేలకోట్లు ఇచ్చింది
* తొలి ఏడాది రెవెన్యూ లోటు రూ.13,897 కోట్లు
* 2015-16 సంవత్సరం ఆదాయ లోటు రూ.4,140 కోట్లు
* 2015 -16 బడ్జెట్‌ లోటు రూ.17వేల కోట్లు
* పోలవరం ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది.
* జలవనరులశాఖకు రూ.7,325కోట్లు
* పట్టిసీమ ప్రాజెక్టు విజయవంతమైంది.
* చిన్ననీటి పారుదల రంగానికి రూ.674 కోట్లు
* తోటపల్లి, పోలవరం కుడికాలువ, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం.
* వంశధార, గుండ్లకమ్మ, వెలుగొండ ప్రాజెక్టులను 2018లోపు పూర్తి చేస్తాం!
* నీటిపారుదల పథకాలను శీఘ్రగతిన పూర్తి చేసేందుకు రూ.3,135.25కోట్లు
* గతేడాది మొత్తం 76,818 మందికి ఉపాధి కల్పించాం.
* పట్టు పరిశ్రమకు రూ.147కోట్లు
* ఉద్యానశాఖకు రూ.659కోట్లు
* పశుసంవర్థకశాఖకు రూ.819
* మత్య్సశాఖకు రూ.339కోట్లు
* వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.16,491కోట్లు
* రుణ విముక్తి పథకానికి రూ.3,512 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి రూ.4,467కోట్లు
* ఐసీడీఎస్‌ పథకానికి రూ.772కోట్లు
* 2015-16లో చిన్న, భారీ, మహా పరిశ్రమలకు రూ.9,505 కోట్లు పెట్టుబడులు
* 2016-17లో పారిశ్రామిక పెట్టుబడులు రూ.11,500 కోట్లు లక్ష్యం
* 2015-16లో రూ.111 కోట్ల చేనేత రుణాలు మాఫీ
* చేనేత రుణమాఫీతో 24,309 చేనేత కుటుంబాలకు లబ్ధి
* రహదారి భద్రతకు రూ.150 కోట్లు
* రాష్ట్రంలో రహదార్ల అభివృద్ధికి రూ.3,184 కోట్లు
* కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
* బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లు
* బీసీల సంక్షేమానికి ఈ సారి రూ. 8,832 కోట్లు
* ఎస్సీలకు రూ.8724 కోట్లు
* ఎస్టీలకు రూ.3100 కోట్లు కేటాయించారు.
* జూన్‌ 2016 నాటికి 4.6లక్షల గృహాలకు విద్యుదీకరణ పూర్తి చేయాలని లక్ష్యం
* రానున్న మూడేళ్లలో 4,800 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం
* చిత్తూరు జిల్లాలో 5వేల హెక్టార్లలో జాతీయ పెట్టుబడులు, తయారీ మండలి
* చిత్తూరు జిల్లాలో తయారీ మండలిలో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
* 93.5 లక్షల గృహాలకు 1.87 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు
* రూ.23వేల కోట్లతో ప్రకాశం జిల్లా దొనకొండలో5,079 ఎకరాల్లో పారిశ్రామిక మండలి ఏర్పాటు
* ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రూ.377 కోట్లు
* నైపుణ్యాల అభివృద్ధిలో భాగంగా లక్షమందికి శిక్షణ

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles