Congress Slams Raj Thackeray, Dubs His Remark 'Irresponsible'

Raj thackeray burn newly registered autos of non maharashtrians

maharashtra navnirman sena, mns, raj thackeray, marathi agenda, auto-rickshaws, auto-rickshaws in mumbai, auto-rickshaws permits, MNS, BJP, Opposition, devendra fanavis, Congress, NCP

The MNS chief Raj Thackeray alleged that the BJP-led government’s haste in issuing these permits was to benefit a particular company that manufactures three-wheelers, each costing Rs 1.7 lakh.

వలసవాదులకు వ్యతిరేకంగా రాజ్ థాకరే వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 03/10/2016 01:09 PM IST
Raj thackeray burn newly registered autos of non maharashtrians

రాష్ట్రంలో కరువు కాటాకాలు, ఇత్యాది అనేక సమస్యలు ప్రజలను ఇబ్బందులు పెడుతుండగా, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చి.. రాష్ట్రంలో మరోమారు ప్రాంతీయతత్వాన్ని రగిల్చే వివాదాస్పద వ్యాక్యలు చేశారు మహారాష్ట్ర నవనిర్మణ సమితి అధినేత రాజ్ థాకరే. పోట్ట చేత పట్టుకుని దేశా ఆర్థిక రాజధాని ముంబై సహా మహారాష్ట్రలోకి వలస వెళ్లిన వారికి వ్యతిరేకంగా వ్యాఖ్యాలు చేసి మరోమారు ప్రాంతీయ, వలసవాదుల మధ్య చిచ్చు రగల్చే ప్రయత్నం చేశారు.

మహారాష్ట్రలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని ఆరోపించిన ఆయన 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసవాదులకు అత్యధిక సంఖ్యలో అటో పర్మిట్లు ఇచ్చిన నేపథ్యంలో వాటన్నింటినీ గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేశారు. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని అన్నారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాగా రాజ్ థాకరే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎంఎన్ఎస్ అధినేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raj Thackeray  MNS  BJP  Opposition  devendra fanavis  Congress  NCP  

Other Articles