Mumbai's first 'test-tube' baby becomes a mother

Mumbai s first test tube baby becomes a mother

Test Tube baby, test tube baby as mother, Test Tube baby becomes mother

On 6 August, 1986 Mumbai's first test tube baby, Harsha Chawda, was born. Now 29, Chawda has given birth to a healthy baby boy on Monday morning. Her husband Divyapal Shah is excited to be a father. He said, "I am very happy and can't wait to take Harsha and the baby to our home." The delivery was carried out at Jaslok Hospital in Mumbai by gynaecologist Dr. Indira Hinduja (who had lead the team during Chawda's birth in 1986) and Dr. Kusum Zaveri.

టెస్ట్ ట్యూబ్ బేబికి బేబి

Posted: 03/09/2016 07:37 AM IST
Mumbai s first test tube baby becomes a mother

దాదాపు మూడుదశాబ్దాల కిందట వైద్య జీవశాస్త్రంలో ఓ అద్భుతం జరిగింది. దేశంలో తొలిసారి టెస్ట్ ట్యూబ్ బేబికి బేబిగా ‘హర్షా చావ్డా’ నిలిచింది. 1986లో ముంబైలో పిల్లలు లేని ఓ జంటకు కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ. ఇప్పుడామె మరో బిడ్డకు తల్లయింది. ఆమె పుట్టినప్పుడు వైద్య సాయం చేసిన డాక్టర్ల బృందమే, ఇప్పుడు సిజేరియన్ చేసి పండంటి మగ బిడ్డను బయటకు తీశారు. "మహాశివరాత్రి పర్వదినం నాడు మా కుటుంబానికి పరమశివుడు ఇచ్చిన ఓ గొప్ప బహుమతి ఇది" అని హర్షా భర్త దివ్యపాల్ షా తన అనందాన్ని వెలిబుచ్చారు. తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ సృష్టికర్త డాక్టర్ ఇందిరా హిందుజా, ఆ బేబీ పెరిగి పెద్దయి గర్భవతిగా వస్తే, తిరిగి ఆపరేషన్ నిర్వహించారు. ఆపై ఇందిర మాట్లాడుతూ, "హర్షా పుట్టిన రోజు నాకింకా గుర్తుంది. అప్పుడామె బరువు 3.18 కిలోలు. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందించారో, నేను అంతకన్నా ఎక్కువగా ఆనందపడ్డా. ఆ తరువాత మేము 15 వేలకు పైగా టెస్ట్ ట్యూబ్ బేబీలను అందించాం" అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Test Tube baby  test tube baby as mother  Test Tube baby becomes mother  

Other Articles