Total solar eclipse captivates crowds across Asia

Total solar eclipse captivates crowds across asia

Solar eclipse, Aisa, earth, Sun

Crowds across Asia were treated to stunning views of a total solar eclipse on Wednesday morning.Those in Indonesia had the best vantage point. The moon blacked out the sun in totality over Indonesia's main western island of Sumatra, before moving eastwards across Sulawesi and Borneo, and then over to the Maluku Islands.

కనువిందు చేసిన సూర్యగ్రహణం

Posted: 03/09/2016 09:30 AM IST
Total solar eclipse captivates crowds across asia

సూర్య గ్రహణం కనువిందు చేసింది. ప్రపంచంలోని పలు దేశాల్లో అలరించింది. భారత్ లో మాత్రం పాక్షికంగానే గ్రహణం కనిపించింది. హిందూ మహా సముద్రం నుంచి సుమత్రా, బోర్నియా, తూర్పు ఆసియా దేశాలతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన కొన్ని దీవుల గుండా గ్రహణం పయనించింది. మధ్య పసిఫిక్ వరకూ విస్తరించిన ఒక సన్నటి ప్రదేశంలోనే సంపూర్ణ గ్రహణం కనిపించింది. దేశంలోని తూర్పు ప్రాంతాల్లో పాక్షిక గ్రహనాన్ని జనం చూశారు.

చాలా ప్రాంతాల్లో సూర్యోదయానికి ముందు గ్రహణం ప్రారంభమైంది. కోల్ కతాలో ఉదయం 5.51కి సూర్యోదయం ప్రారంభమయ్యే సమయంలోనే గ్రహణం ఆరంభమైంది. 6 గంటల 6 నిమిషాలకు గరిష్ట స్థాయి పాక్షిక గ్రహణం కనిపించింది. 6.50కి గ్రహణం ముగిసింది. ఈశాన్య ప్రాంతంలోని వారికి కూడా ఈ గ్రహణం ప్రారంభదశలో కనిపించింది. గౌహతిలో 5.55కి గ్రహణం ప్రారంభమైంది. హైదరాబాద్ లో.. ఉదయం 6.29కి గ్రహణం ప్రారంభమై 6.47కి ముగిసింది. 12 శాతమే గ్రహణం కనిపించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Solar eclipse  Aisa  earth  Sun  

Other Articles