Oppositions slam Telangana Govt for MoUs with Maharastra

Oppositions slam telangana govt for mous with maharastra

Revanth Reddy, Telangana, KCR, Maharastra, Projects

Oppositions slam Telangana Govt for MoUs with Maharastra.Congress Leader Sravan and TDP Leader Revanth Reddy fired on KCR and Telangana Govt.

మహారాష్ట్రతో తెలంగాణ ఒప్పందంపై ప్రతిపక్షాల ఫైర్

Posted: 03/09/2016 07:30 AM IST
Oppositions slam telangana govt for mous with maharastra

మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందంతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందం.. మహా ఒప్పందం అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. గతంలో చేసిన అగ్రిమెంట్లకు విరుద్ధంగా ఈ ఎంవోయూ కుదుర్చుకున్నారన్నారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్ మాట్లాడుతూ… మోసానికి, దగాకు, చిల్లర రాజకీయాలకు టీఆర్ఎస్ చిరునామాగా మారిందన్నారు. 2012లోనే మా ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహాప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయని చెప్పిన ఆయన… ఇవాళ్టి సీఎం కేసీఆర్ సంతకం తెలంగాణ ప్రజలను ముంచే రోజుగా.. మహా ప్రజలకు మంచి రోజుగా మారిందన్నారు. తప్పుడు ప్రచారాలతో లబ్ధి చేకూర్చుకుంటున్నారని మండిపడ్డారు శ్రవణ్.

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర పర్యటన పైన గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తుమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లు నిర్మించుకోవచ్చునని మహారాష్ట్ర గతంలోనే చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా 148 మీటర్లకే మహారాష్ట్ర అంగీకరించిందని చెప్పారు. కానీ ఈ ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తేనే ఉపయోగం ఉంటుందన్నారు. దీనిపై తెలంగాణ సీఎం కెసిఆర్ సాధించికు వచ్చింది ఏమీ లేదన్నారు. గోదావరి జలాలను హైదరాబాద్ తరలించాలనేది గతంలో టిడిపి నిర్ణయమే అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Telangana  KCR  Maharastra  Projects  

Other Articles