Public entry at Kolkata airport restricted after threat e-mail

Security stepped up at kolkata airport after threat mail

terror threat, terror threat in kolkata, kolkata threatened, terror attacks, kolkata airport, bose international airport, threat e-mail, germany, kolkata airport, subash chandrabose airport, kolkata airport under terror threat

The mail came in the airport manager's email ID early on Sunday and it was claimed to have been sent from Germany, officials said.

కోల్‌కతా విమానాశ్రయానికి బెదిరింపు ఈ-మెయిల్‌..

Posted: 03/07/2016 04:40 PM IST
Security stepped up at kolkata airport after threat mail

శివరాత్రి పర్వదినాన.. ఆలయాల్లో భక్తులు అధికసంఖ్యలో వస్తారని భావించిన ఉగ్రవాదులు అక్కడ అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడవచ్చన ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో గత వారం రోజులుగా దేశంలో హై అలర్ట్ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా పోలీసులు, సాయుధ బలగాలు నిఘాను ఏర్పాటు చేస్తూనే వున్నాయి. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది.

దీంతో ఉలిక్కిపడిన భద్రతాదళాలు ముందుజాగ్రత్త చర్యగా ప్రజలకు విమానాశ్రయం లోనికి ఎవర్నీ అనుమతించడం లేదు. బెదిరింపు ఈ-మెయిల్‌ కారణంగా మూడు రోజుల పాటు విమానాశ్రయంలోకి ప్రజలకు ప్రవేశం నిలిపివేశారు. తమ డిమాండ్లకు అంగీకరించని పక్షంలో ఎయిర్ పోర్టును పేల్చివేస్తామని అగంతకులు ఈ మెయిల్ లో హెచ్చరించినట్లు వార్తలు అందుతున్నాయి. కాగా కోల్‌కతాలోని నేతాజీ సుబాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చిందని భద్రతా దళాలు పేర్కోన్నాయి.

కాగా విమానాశ్రయ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. విమానాశ్రయ మేనేజర్‌ మెయిల్‌కు ఈ బెదిరింపు మెయిల్‌ వచ్చిందని, అది జర్మనీ నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. అగంతకులు ఈ-మెయిల్‌లో రూ.16లక్షలు డిమాండ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం వచ్చిన ఈ బెదిరింపు మెయిల్‌తో విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. సైబర్‌ క్రైం బృందం ఈ-మెయిల్‌లో సమాచారం నిజానిజాలపై పరిశీలిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terror threat  threat e-mail  germany  kolkata airport  subash chandrabose airport  

Other Articles