Status update: Want to sell my wife for Rs 1 lakh, says debt-ridden man on Facebook

Want to sell my wife for rs 1 lakh says a man fb post

30-year-old man, husband from Khargone district, husband sell wife for Rs 1 lakh, debt-ridden husband sells wife, husband post sale of wife, husband posts sale of wife in face book, wife for sale

In a bizarre incident, a 30-year-old man from the Khargone district allegedly posted a 'status update' on social networking site Facebook seeking to sell his wife for Rs 1 lakh, in order to clear his debts.

భార్యను అమ్మకానికి పెట్టిన భర్త .. కలియుగ హరిశ్చంద్రడు మాత్రం కాదు..

Posted: 03/07/2016 05:15 PM IST
Want to sell my wife for rs 1 lakh says a man fb post

ఎప్పుడో సత్యయుగంలో సత్యానికి, ఇచ్చిన వచనానికి కట్టుబడి తన సతిని కూడా విక్రమించిన సత్య హరిశ్చంద్రుడి కథ మనకు పురాణాలు, పాఠ్యపుస్తకాలలో వింటున్నాం, చదువుతున్నం. అయితే అదే తరహాలో కలియుగ హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మాకానికి పెడతూ పోస్టు పెట్టి సంచలనానికి తెరతీసాడు. విచ్చలవిడిగా అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు మార్గం కనబడకపోవడంతో తన సతినే విక్రమించడానికి సిద్దపడ్డాడు ఈ ఘనుడు. ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకొంటున్న సందర్భంలోనే మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌ జిల్లాలో ఓ వికృత ఘటన చోటుచేసుకుంది. అప్పుల పాలైన ఓ 30 ఏళ్ల వ్యక్తి.. వాటిని తీర్చుకోవడానికి తన భార్యను అమ్మడానికి సిద్ధమయ్యాడు. లక్ష రూపాయలు ఇస్తే తన భార్యను అమ్మేస్తానంటూ ఏకంగా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు.

అతని నిర్వాకంతో నివ్వెరపోయిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె భర్త దిలీప్ మాలిపై ఐపీసీ సెక్షన్‌ 509 (మాటలు, చర్యలు, చేష్టలతో మహిళలను కించపరచడం) ఎరోద్‌రోమ్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు దిలీప్ సింగ్ తన భార్య, రెండేళ్ల కూతురు ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. ఆ పోస్టులో తన ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చాడు. తన భార్యను అమ్మాలనుకుంటున్నాని హిందీలో ఈ పోస్టులో పేర్కొన్నాడు. 'వేర్వేరు వ్యక్తుల వద్ద నేను తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా భార్యను లక్ష రూపాయలకు అమ్మేస్తాను. ఎవరైనా కొనేందుకు ఆసక్తిగా ఉంటే నా ఫోన్‌ నంబర్‌కు సంప్రదించండి' అని అతడు తన పోస్టులో పేర్కొన్నాడు.

తన బంధువుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అతని భార్య షాక్ తింది. తనను, తన కుటుంబసభ్యులను అవమానపరిచేందుకు అతను ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దిలీప్‌ మాలితో ఆమెకు మూడేళ్ల కిందట పెళ్లయింది. వివాహం అనంతరం ఈ జంట ఇండోర్‌లో స్థిరపడింది. అక్కడ తెలిసినవారందరి దగ్గరా అప్పులు చేసిన దిలీప్‌.. వాటిని తీర్చలేక తన పూర్వీకుల ఊరికి పరారయ్యాడు. దీంతో చేసేదేమీ లేక తాముంటున్న అద్దె ఇంటిని ఖాళీ చేసి అతని భార్య, రెండేళ్ల కూతురు తమ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : selling wife  Debt ridden man  facebook post  

Other Articles