nellore soil test ADA officer harrasses widow sub-ordinate in nellore

Officer physical harrasment on widow sub ordinate in nellore

women widow agriculture officer complaints to collecter janaki on his superior officer and nellore soil test section ADA officer, who sexuall harassed her daily rape, gangrape, attrocities on women, women widow agriculture officer, collecter janaki, superior officer, nellore soil test section ADA officer, sexuall harrassment on sub ordinate, harrassment on women, rape on women, gangrape on women, crime news

women widow agriculture officer complaints to collecter janaki on his superior officer and nellore soil test section ADA officer, who sexuall harassed her daily

నెల్లూరులో లైంగిక వేధింపులు.. ఉన్నతాధికారిపై ఉద్యోగి పిర్యాదు..

Posted: 03/06/2016 11:57 AM IST
Officer physical harrasment on widow sub ordinate in nellore

ఫోన్ చేసి విసిగిస్తాడు.. పదేపదే తన గదికి రమ్మంటాడు.. నీ పదోన్నతి కోసం సీఆర్‌పై సంతకం చేశా కదా.. మనసారా ముద్దివ్వవా?... అంటూ వేధిస్తున్నాడు... భర్త లేని నీవు నాతో గడిపితే.. ఉద్యోగమే అవసరం లేదు.. ఒప్పుకోనందుకు కార్యాలయానికి వచ్చినా సెలవేనంటూ హెచ్చరిస్తున్నాడు.. నేనిక ఉద్యోగం చేయలేను.. ఆత్మహత్యే శరణ్యం’... అంటూ ఓ వ్యవసాయాధికారిణి కలెక్టర్‌ ఎం. జానకికి ఫిర్యాదు చేశారు. భూసార పరీక్షల కేంద్రం ఏడీఏ తనను శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నాడని లిఖిత పూర్వకంగా తెలిపారు. దీంతో ఆ అధికారి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
 
నెల్లూరు తాలూకా కార్యాలయ ప్రాంగణంలో ఉన్న భూసార పరీక్షల కేంద్రంలో వ్యవసాయాధికారణిగా పని చేస్తున్న మహిళ ఇప్పటి వరకు అధికారులకు నేరుగా ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. సదరు ఆ అధికారి పై ఉన్నతాధికారులు హెచ్చరికలతో సరిపెట్టారు. కాగా అతడి వేధింపులు మితిమీరడంతో బాధితురాలు లిఖితపూర్వకంగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలు ఆరోపణలు మూటకట్టుకున్న సదరు అధికారి ఏడీఏ కేడర్‌ నుంచి ఏవో డిమోషన్‌ అయ్యారు. 2015 నవంబరు నుంచి తనను టార్గెట్‌ చేసిన ఏడీఏ ప్రతిరోజూ వేధిస్తున్నాడంటూ బాధితురా లు వాపోయారు.

ప్రమోషన్‌ సీఆర్‌పై సంతకం చేసినందుకు ముద్దివ్వాలని, భర్తలేనందున తనకు లొంగాలని, బెదిరింపులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి 11, 12 తోటి ఉద్యోగినులు రాకపోయినా, సెలవు ప్రకటించినా ఏడీఏ తనచేత బలవంతంగా సెలవు పె ట్టిం చాడని వివరించారు. ఇప్పటికే అతడి వేధింపులపై జేడీ, ఉద్యోగ సంఘం నాయకుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఇకపై వేధింపులు భరాయించే శక్తి తనకు లేనందున ఆత్మహత్యే శరణ్యమని బాధి తురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : widow agriculture officer  collecter janaki  superior officer  nellore ADA officer  

Other Articles