Kate Middleton-Prince William India tour in April

Kate middleton and prince william s exotic royal tour

Kate Middleton news,Kate Middleton latest news,Kate Middleton daughter,kate middleton daily mail,Kate Middleton prince william india tour,princess diana news,Kate Middleton prince william india visit,kate middleton india,Kate Middleton Dresses,prince william dresses

Kate Middleton and Prince William are gearing up for their very first trip to India. The royal couple is reportedly looking forward to their week-long visit, during which they will tour Bhutan as well.

భారత్ పర్యటనకు విచ్చేస్తున్న బ్రిటెన్ రాజదంపతలు..

Posted: 03/06/2016 12:32 PM IST
Kate middleton and prince william s exotic royal tour

బ్రిటన్ యువరాజు సతీ సమేతంగా భారతదేశానికి తొలిసారి రాబోతున్నారు. సమకాలీన భారతీయ జీవన శైలిలోని వివిధ అంశాలను వీరు పరిశీలిస్తారు. యువత, క్రీడలు, పారిశ్రామిక రంగం, పట్టణ పేదరికం నిర్మూలనకు జరుగుతున్న కృషి, సృజనాత్మక కళలు, గ్రామీణ జీవన విధానం వంటి అంశాల గురించి తెలుసుకుంటారు. ఈ రాజ దంపతులను డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. కెన్సింగ్టన్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటన వెల్లడించిన వివరాల ప్రకారం బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, ఆయన సతీమణి కేట్ మిడిల్‌టన్ వచ్చే నెల 10 నుంచి వారం రోజుల పాటు భారత్ లో పర్యటించననున్నారు.

బ్రిటెన్ యువరాజు దంపతులు ఈ నెల 10న ముంబైలోనూ, 11న న్యూఢిల్లీలోనూ పర్యటిస్తారు. 12, 13 తేదీల్లో అస్సాంలోని కాజీరంగా జాతీయ ఉద్యానవనాన్ని సందర్శిస్తారు. ఈ ఉద్యానవనం చుట్టూ నివసిస్తున్న గ్రామీణుల సంప్రదాయాలను తెలుసుకుంటారు. 14న భూటాన్‌లో పర్యటిస్తారు. 16న ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శిస్తారు. విలియం, కేట్ భారతదేశ సందర్శనపై కెన్సింగ్టన్ ప్యాలెస్ అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ రాజ దంపతులు ఏ దేశంతోనైతే సత్సంబంధాలను ఏర్పరచుకోవాలని రాజదంపతులు ప్రయత్నిస్తున్నారో ఆ దేశంతో పరిచయం ఏర్పరచుకోవడానికే ఈ పర్యటన అని తెలిపారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prince William  Kate middleton  INDIA  Tour  

Other Articles