Assembly elections in 5 states begin on April 4, counting on May 19

Polling in hot summer elections in five states in april may

Assam, Assembly Elections, Election Commission, Kerala, Nasim Zaidi, Puducherry, Tamil Nadu, West Bengal, West Bengal, Assam, kerala,

The fate of governments in four states and one union territory will be known on 19 May, when counting for assembly elections will be conducted.

మండుటెండలో ఈసీ పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా..

Posted: 03/04/2016 05:11 PM IST
Polling in hot summer elections in five states in april may

ఇప్పడే గ్రీష్మతాపం దేశప్రజలను అల్లలాడిస్తుంది. సరిగ్గా ఈ సమయంలోనే దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీ పంచ్ పటాకా పేల్చారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలకు షెడ్యూలును విడుదల చేసిన ఆయన నగరాను మ్రోగించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు వివిధ రాష్ట్రాలకు వివిధ రోజుల్లో  ఎన్నికలు జరగనున్నాయి. కేరళలో 140, తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్‌లో 294, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మొత్తం ఐదు రాష్ట్రాల్లో కలిపి 824 నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. కేరళలో 21వేలు, తమిళనాడులో 65వేలు, పశ్చిమ బెంగాల్‌లో 77వేలు, పుదుచ్చేరిలో 913 చొప్పున పోలింగ్ కేంద్రాలు ఉంటాయని జైదీ తెలిపారు. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తామని అన్నారు. నోటాకు కూడా ప్రత్యేక గుర్తును ఈ ఎన్నికల నుంచి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఈవీఎంలకు ప్రింటర్లు జతచేస్తున్నామని అన్నారు. అభ్యర్థులందరి ఫొటోలను కూడా ఈవీఎంలలో ఉంచుతామని తెలిపారు.

మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అసోంలో 2 దశలలోను, పశ్చిమబెంగాల్‌లో 6 దశలల్లో ఎన్నికలను నిర్వహిస్తుండగా, మిగిలిన మూడు రాష్ట్రాలు.. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ఒకే దశలోను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల  ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 19వ తేదీన ఉంటాయి. మొత్తం ఎన్నికల ప్రక్రియ మే 21 నాటికి ముగుస్తుందని నసీం జైదీ ప్రకటించారు.

అసోం

తొలి దశ 65 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 11
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి
ఉపసంహరణ గడువు: 21 మార్చి
పోలింగ్ తేదీ: 4 ఏప్రిల్ (సోమవారం)

రెండోదశ 61 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: మార్చి 14
నామినేషన్ల ముగింపు తేదీ: 21 మార్చి
నామినేషన్ల పరిశీలన: 22 మార్చి
ఉపసంహరణ గడువు: 26 మార్చి
పోలింగ్ తేదీ: 11 ఏప్రిల్ (సోమవారం)

పశ్చిమబెంగాల్
 
తొలి దశ 18 నియోజకవర్గాలు (రెండుసార్లుగా జరుగుతుంది)
నోటిఫికేషన్ జారీ: 11 మార్చి, 21 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 18 మార్చి, 22 మార్చి
నామినేషన్ల పరిశీలన: 19 మార్చి, 26 మార్చి
పోలింగ్ తేదీలు: 4 ఏప్రిల్, 11 ఏప్రిల్

రెండోదశ 56 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 22 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 29 మార్చి
నామినేషన్ల పరిశీలన: 30 మార్చి
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 1
పోలింగ్ తేదీ: 17 ఏప్రిల్

మూడోదశ 62 నియోకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: 28 మార్చి
నామినేషన్ల ముగింపు తేదీ: 4 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 5 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 7 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 21 ఏప్రిల్

నాలుగోదశ 49 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 1
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 4
నామినేషన్ల పరిశీలన: 9 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 11 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 25 ఏప్రిల్

ఐదోదశ 53 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 4
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 11
నామినేషన్ల పరిశీలన: 12 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 16 ఏప్రిల్
పోలింగ్ తేదీ: 30 ఏప్రిల్

ఆరోదశ 25 నియోజకవర్గాలు
నోటిఫికేషన్ జారీ: ఏప్రిల్ 11
నామినేషన్ల ముగింపు తేదీ: ఏప్రిల్ 18
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 19
ఉపసంహరణ గడువు: ఏప్రిల్ 21
పోలింగ్ తేదీ: మే 5

కాగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలు ఒకే దశలో, ఒకే రోజున నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కేరళ అసెంబ్లీలోని 140 స్థానాలు, తమిళనాడు లోని  234 స్థానాలు, పుదుచ్చేరి 30 నియోజకవర్గాలకు ఏప్రిల్ 22న నోటిఫికేషన్ విడుదల కాగా, 29న నామినేషన్లు ముగింపు, 30న నామినేషన్ల పరిశీలన, మే 2 నామినేషన్ల  ఉపసంహరణ గడువుగా ప్రకటించారు. కాగా మే 16న ఎన్నికలు నిర్వహించనుండగా, అదే నెల 19న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

నోటిఫికేషన్ జారీ: 22 ఏప్రిల్
నామినేషన్ల ముగింపు తేదీ: 29 ఏప్రిల్
నామినేషన్ల పరిశీలన: 30 ఏప్రిల్
ఉపసంహరణ గడువు: 2 మే
పోలింగ్ తేదీ: 16 మే

ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు తేదీ:  మే 19
ఎన్నికల ప్రక్రియముగింపు 21 మే

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assembly elections  Election commision  Assembly polls  West Bengal  Assam  kerala  pududherry  Tamil Nadu  

Other Articles