current t20 team is ready to play anywhere in world mahendra singh dhoni

Dhoni praises his side ahead of final and t20 world cup

India vs United Arab Emirates Score, Ind vs UAE, Asia Cup, Cricket Score, cricket, Mahendra Singh Dhoni, asia cupn 2016, india, uae,Dhoni, india, bangladesh, twenty 20, Amjad Javed, Yuvraj Singh, cricket news

India skipper Mahendra Singh Dhoni feels the current Indian team is a “balanced” side which can “take on any team anywhere in the world' at least in the t-29 format

టీమిండియా ఎక్కడైనా.. ఎవరితోనైనా అడి విజయాన్ని సాధిస్తుంది: ధోని

Posted: 03/04/2016 06:33 PM IST
Dhoni praises his side ahead of final and t20 world cup

ఆసియా కప్ టోర్నమెంటులో ఓటమి ఎరుగని జట్టుగా దూసుకెళ్తున్న టీమిండియా పట్ల ఆ జట్టు కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని సంతోషం వ్యక్తం చేశారు. టీ 20 మ్యాచ్ లలో తమ జట్టు అత్యంత నిలకడగా ఉందని  స్పష్టం చేశాడు. ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఎక్కడైనా  ఏ జట్టుతోనైనా కచ్చితమైన పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ధీమాను వ్యక్తం చేశాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20ల్లో టీమిండియా పటిష్టతతో పాటు సమతుల్యంగా కూడా కనబడుతుందన్నాడు.
 
టీమిండియా జట్టును చూడండి. ఇలా ఉండటం తరచుగా జరగొచ్చని. తాము ఈ ఏడాది ఆడిన 10 టీ 20ల్లో తొమ్మిది గెలిచామని ధోని పేర్కోన్నాడు. స్వదేశంతో పాటు విదేశాలలో కూడా తాము టీ 20 మ్యాచ్ లను అడి గెలిచామన్నారు. పలు దేశాల్లో వివిధ పరిస్థితుల్లో ఆడి నెగ్గామన్నాడు. తాను కేవలం టీ 20 ఫార్మెట్ గురించి మాత్రమే  చెబుతున్నానని, వన్డేల గురించి కాదని ధోని స్పష్టం చేశాడు. టీమిండియా జట్టులో ముగ్గురు యోగ్యమైన సీమర్లు ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లు, పార్ట్ టైమర్లు కూడా ఉన్నారని తెలిపాడు.

ఎనిమిదో స్థానం వరకూ తమ బ్యాటింగ్ పై భరోసా ఏర్పడిందని.. దాంతో మ్యాచ్ చివర్లో కొన్ని విలువైన పరుగులు కూడా జట్టుకు అదనంగా చేకూరుతాయని తెలిపాడు.ఇదే సరైన కాంబినేషన్ అనుకుంటున్నానని యూఏఈతో మ్యాచ్ లో  విజయం సాధించిన అనంతరం ధోని జట్టుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఆసియాకప్లో చివరి, ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్తో పోటీ కచ్చితంగా ఉంటుందన్నాడు. ఏ జట్టుకైనా స్వదేశీ పరిస్థితులు బాగా తెలియడం వల్ల బంగ్లాతో పోరు హోరాహోరీగా జరిగే అవకాశం ఉందన్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : asia cupn 2016  india  uae  Mahendra Singh Dhoni  india  bangladesh  twenty 20  

Other Articles