We want freedom in India, not from India'

We want freedom in india not from india

JNU, Kanhaiah Kumar, India, Freedom, Tihar Jail

Jawaharlal Nehru University Students’ Union President Kanhaiya Kumar declared on Thursday night, that what the students wanted was “freedom in India, not freedom from India.” Addressing a huge gathering of students on the campus, soon after release from Tihar Jail, Mr. Kumar said: “It is not azadi from India, it is azadi in India [we want]... from the corrupt practices that are going on inside the country.” Mr. Kumar made his fiery speech at the same place where he had addressed students just a day before his arrest.

దేశంలోనే స్వాతంత్ర్యం కోరుతున్నాం: కన్హయ్య కుమార్

Posted: 03/04/2016 09:38 AM IST
We want freedom in india not from india

దేశంలో తీవ్ర సంచలనం రేపిన దేశద్రోహం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న జెఎన్యు విద్యార్థి కన్హయ కుమార్ బెయిల్ మీద బయటకు వచ్చారు. కన్హయ్య కుమార్ బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. తాము భారతదేశం నుంచి ఆజాదీ (స్వాతంత్య్రం) కోరట్లేదని..  దేశంలోనే స్వాతంత్య్రం కోరుతున్నాం అని కన్నయ్య కుమార్‌ స్పష్టం చేశారు. తిహార్‌ జైలు నుంచి విడుదలైన జేఎన్‌యూఎ్‌సయూ అధ్యక్షుడు కన్నయ్యకుమార్‌ వర్సిటీ ప్రాంగణంలో గంటకు పైగా భావోద్వేగ ప్రసంగం చేశారు. ఏబీవీపీపై తమకు ఎలాంటి పగ లేదని.. ఎందుకంటే తాము ప్రజాస్వామ్యవాదులం అని అన్నారు.  వారిని తమ ప్రతిపక్షంగా మాత్రమే చూస్తామని కన్హయ కుమార్ అన్నారు.

ప్రధాని మోదీ భావాలతో తనకు విభేదాలు ఉండొచ్చు. కానీ.. ‘సత్యమేవ జయతే’ అంటూ ఆయన చేసిన ట్వీట్‌తో మాత్రం ఏకీభవిస్తున్నానని కన్హయ కుమార్ స్పష్టం చేశారు.  ఎందుకంటే ఆ పదాలు మన రాజ్యాంగంలో ఉన్నాయని చెప్సుకొచ్చారు. జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంత సులభం కాదు. అలాగే.. జేఎన్‌యూలో ఉన్నవారిని మాట్లాడకుండా చేయడం కూడా అంత సులభం కాదని అన్నారు. తన అరెస్టు.. జేఎన్‌యూ మీద ఒక ప్రణాళిక ప్రకారం జరిపిన దాడి అని ఆరోపించారు. రోహిత్ వేములకు న్యాయం జరగకుండా అడ్డుకోవడానికి జరిగిన దాడి అని అభివర్ణించారు. జేఎన్‌యూ, రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో.. ఈ సమాజంలోని శాంతి కాముక, ప్రగతిశీల వర్గాల ఘర్షణ సుదీర్ఘంగా కొనసాగనుందని అన్నారు. దేశంలోని క్లిష్టమైన అంశాల నుంచి స్వాతంత్య్రం కోరడమే నేరమా? అని ప్రశ్నించారు. పీఎం మన్‌ కీ బాత్ గురించి మాట్లాడతారు.... అంతే తప్ప వినరు అని అన్నారు. సరిహద్దుల్లో చనిపోతున్న సైనికులకు నా వందనం. కానీ.. దేశంలో దుర్భర దారిద్య్రం కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల మాటేమిటి? మెజారిటీ సైనికుల తండ్రులు ఆ రైతులే. మా నాన్న ఒక రైతు. మా అన్న ఒక సైనికుడు. ఆ సైనికులు తమ ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్న యుద్ధాలకు బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU  Kanhaiah Kumar  India  Freedom  Tihar Jail  

Other Articles