Payyavula Keshavulu told jagans assets value

Payyavula keshavulu told jagans assets value

Jagan, Payyavula Keshavulu, AP, Amaravati, Chandrababu, YS Jagan

Payyavula Keshavulu told jagans assets value. He said that jagan had two hundred Seventy Nine crore vaualbe assets.

జగన్ ఆస్తుల విలువ 279 కోట్లు

Posted: 03/04/2016 09:04 AM IST
Payyavula keshavulu told jagans assets value

సాక్షిలో వచ్చిన అమరావతి భూబాగోతం మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవులు స్పందించారు. తాను దొంగాచాటుగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదని.. దర్జాగా హుందాగా తానే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే రాజధాని భూముల మీద కథనాన్ని ప్రచురించిన సాక్షి పత్రిక యజమాని అయిన జగన్ మీద పయ్యావుల విమర్శలు గుప్పించారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఆస్తుల విలువ 279 కోట్లు. అసెంబ్లీ స్పీకర్‌కు ఇచ్చిన లేఖలో జగన ఈ విషయం పేర్కొన్నారు. జగన ఇచ్చిన ఆస్తులు, అప్పుల వివరాలను పయ్యావుల బయటపెట్టారు. శాసనసభ నైతిక నియమావళి ప్రకారం సభ్యులంతా తమ ఆస్తుల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్‌ 30 నాటికి తనకున్న అప్పులు, ఆస్తులు, వాటి విలువల వివరాలను ఇస్తున్నట్లు జగన్‌ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఫయ్యావుల వెల్లడించిన దాని ప్రకారం జగన్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఇడుపులపాయలో వ్యవసాయ భూమి విలువ 6. 35 లక్షలు; హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌ను ఆనుకొని ఉన్న సాగర్‌ సొసైటీలో ఉన్న భూమి, భవనం విలువ 62.6 లక్షలు; బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో ఉన్న భూమి, భవనం విలువ 6.52 కోట్లు; భాకరాపురంలో ఉన్న వ్యవసాయేతర భూమి, భవనాల విలువ 2.19 కోట్లు; భాకరాపురంలోనే వ్యవసాయేతర భూమి విలువ రూ.3.16 లక్షలు, ఇక్కడే మరో వ్యవసాయేతర భూమి విలువ రూ. 82 వేలుగా పేర్కొన్నారు. తనకున్న బంగారం, ఆభరణాల విలువను 9.37 లక్షలుగా తెలిపారు. అన లిస్టెడ్‌ కంపెనీల్లో తాను పెట్టుబడి పెట్టిన నాడు షేర్ల విలువను 259 కోట్లుగా పేర్కొన్నారు. గతంలో వివాదంలో ఉన్న ఆదాయపు పన్ను 11 కోట్లు చెల్లించానని, ఇతర ఆస్తులు 23 లక్షలు న్నాయని చెప్పారు. చేతిలో డబ్బు 8.13 లక్షలు ఉందని, వివిధ బ్యాంకుల్లో 1.20 కోట్ల డబ్బుందని వివరించారు. అప్పులు 2.23 కోట్లు పోను నికర ఆస్తుల విలువను 279. 60 కోట్లుగా చూపారు. తాను తిరిగే ఏపీ 09 బిఎన 2345 కారు సండూర్‌ పవర్‌ కంపెనీ పేరుతో ఉందన్నారు. ప్రస్తుతం మార్చి నెల నడుస్తుండగా.. ఈ లేఖను ఆయన 2016 జూన 15వ తేదీతో స్పీకర్‌కు ఇవ్వడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagan  Payyavula Keshavulu  AP  Amaravati  Chandrababu  YS Jagan  

Other Articles