Youth must be told to say Bharat Mata Ki Jai

Youth must be told to say bharat mata ki jai

RSS, Mohan Bhagwat, India, Bharat Maa, bharat Mataki Jai, JNU Row

RSS chief Mohan Bhagwat today said the new generation needs to be taught to chant slogans hailing mother India, comments that come against the backdrop of a raging row over alleged anti-India sloganeering on the JNU campus. "Now the time has come when we have to tell the new generation to chant `Bharat Mata Ki Jai' (hail mother India). It should be real, spontaneous and part of all-round development of the youth," he said.

భారత్ మాతాకీ జై అనాల్సిందే

Posted: 03/04/2016 11:18 AM IST
Youth must be told to say bharat mata ki jai

ఒకపక్క కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం చెలరేగుతుండగా, మరోపక్క ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మరోసారి కలకలాన్ని రేపుతున్నాయి. కొత్త తరం భారత్‌ మాతాకీ జై అని తప్పనిసరిగా నినదించాల్సిందేనని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. కొత్త తరానికి మనం ఇది నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఈ నినాదమే వాస్తవ పరిష్కారమన్నారు. జేఎన్‌యూ వివాదాన్ని ఆయన నేరుగా ప్రస్తావించకపోయినా... భారత్‌ మాతా కీ జై అనొద్దని కొంతమంది యువ కులకు నూరిపోస్తున్నారంటూ ఈ నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఇదే సరైన సమయమన్నారు. గతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యవస్ధాపకుల్లో ఒకరు క్రీస్తుపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. క్రీస్తు తమిళ హిందూ అని, క్రైస్తవం హిందూ మతంలో భాగమని ఆయన పేర్కొన్నారు

మరోపక్క .పాకిస్థాన్‌ జిందాబాద్‌ అని ఎవరైనా నినదిస్తే వారిని పైనుంచి ఆరు అంగుళాలు నరుకుతానని బీజేపీ బెంగాల్‌ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ తీవ్రంగా హెచ్చరించారు. బెంగాల్‌లోని బీర్‌భూమ్‌ జిల్లాలో ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతి వ్యతిరేక నినాదాలు చేసిన వారికి కూడా ఈ శిక్ష వర్తిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ఘోష్‌ వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆయన ప్రకటనపై బెంగాల్‌ ప్రజలే కాకుండా, రాజకీయ విశ్లేషకులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రకటనలు చేసినందువల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RSS  Mohan Bhagwat  India  Bharat Maa  bharat Mataki Jai  JNU Row  

Other Articles