We dont accept to damage Amaravati Image

We dont accept to damage amaravati image

Amaravati, AP, Chandrababu Naidu, Jagan, sakshi

Chief Minister N Chandrababu Naidu, who was upset with the allegations made against his son Nara Lokesh that he had cornered Rs.425 crore worth Haailand property after the State government adopted a soft attitude towards the management of AgriGold, wanted the YSRC to explain how anyone could take a land that was under attachment.

అమరావతి ఇమేజ్ ను దెబ్బతీయడానికే ఇదంతా

Posted: 03/04/2016 09:03 AM IST
We dont accept to damage amaravati image

ఏపిలో తీవ్ర దుమారం రేపిన రాజధాని భూముల బాగోతం మీద సిఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. నవ్యాంధ్ర నవ రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ సహించబోమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తప్పుడు వార్తలతో బురద జల్లుతున్న వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే కేసు కూడా పెడతామని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం మొదటి దశ పనులను 2018 నాటికల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అమరావతి భూముల విషయంలో ఆక్రమణలు జరిగాయంటూ వస్తున్న వార్తలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్-గా స్పందించారు. రాజధానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఇష్టం వచ్చినట్లు బురద జల్లుతూ ఇమేజ్-ను దెబ్బతీస్తున్నారని ఆయన మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో పెట్టిన సాక్షి పత్రిక ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది కాబట్టి అది ప్రభుత్వ ఆస్తే అని చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. సత్యం ఆస్తులు ఈడీ అటాచ్ చేసినప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తి అయి ఉండి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాసిన ప్రతి వార్తను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. లేదంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామని చెప్పారు. ఆస్తులు కొనగూడదు, వ్యాపారం చేయరాదంటే ఎలా అని ప్రశ్నించారు. అవినీతి జరిగి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amaravati  AP  Chandrababu Naidu  Jagan  sakshi  

Other Articles