Sixteen Hundred Crores for Polavaram Project

Sixteen hundred crores for polavaram project

Polavaram, AP, Uma Bharati, Polavaram Project

Central Minister Uma Bharati said that central govt will allot Sixteen Hundred Crores for Polavaram Project. Poalavaram Project is proud for India.

పోలవరానికి 1600 కోట్లు

Posted: 03/02/2016 09:34 AM IST
Sixteen hundred crores for polavaram project

ఏపి రాష్ట్రానికి అందునా పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం పై తీవ్ర చర్చ సాగుతోంది. జాతీయహోదా ఉన్న పోలవరానికి కేంద్రం ఏ లెక్కన బడ్జెట్ లో వంద కోట్లు కేటాయించిందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి కాస్త ఉమశమనం కలిగించేలా ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తగినన్ని నిధులు ఇస్తామని, నిర్ణీత సమయంలోనే దీన్ని పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి చెప్పారు. జాతీయ హోదా ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిన వైనంపై ప్రశ్నించగా... ‘‘ పోలవరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణం. అందుకే జాతీయ హోదా ఇచ్చాం. ప్రాజెక్టుకు ఈ బడ్జెట్‌లో రూ.1600 కోట్లు కేటాయించాం’’ అని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న డిమాండ్‌ను సమర్థిస్తున్నామని, పోలవరానికి ఎక్కువ నిధులు ఇవ్వాల్సి ఉందని అంగీకరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఎన్ని నిధులు కావాలంటే అంత అందజేస్తున్నామని వివరించారు.
 
నీతి ఆయోగ్‌తో, ఆర్థిక శాఖతో కూడా ఈ అంశంపై తాము మాట్లాడుతుంటామన్నారు. ప్రాజెక్టును నిర్ణీత సమయానికి పూర్తిచేయటంపై చర్చించేందుకు బడ్జెట్‌ ముగిసిన తర్వాత ఢిల్లీకి రావాలని చంద్రబాబును తాను ఆహ్వానించానని చెప్పారు. ఆయన వస్తే తమ శాఖ అధికారులతో కూడా కూర్చుని ఈ అంశంపై చర్చిస్తామన్నారు. పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా పెరగదని ఆమె తెలిపారు. జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి రజత్‌ భార్గవ్ ఇదే అంశంపై మాట్లాడుతూ... బడ్జెట్‌లో పోలవరానికి రూ.100 కోట్లను మాత్రమే కేటాయించినప్పటికీ... అదే బడ్జెట్‌ ప్రసంగంలో రూ.20 వేల కోట్లతో ఇరిగేషన్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ నిధి నుంచి పోలవరానికి నిధులు ఇవ్వడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Polavaram  AP  Uma Bharati  Polavaram Project  

Other Articles