ఏపిలో తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుతున్నట్లు కనిపిస్తున్నాయి.ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం.. తర్వాత కాలం చెల్లినట్లు కనిపించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, బిజెపి పార్టీ కార్యకర్తలకు ఎక్కడా సయోధ్య కుదరడం లేదు. బీజేపీ-టీడీపీల మధ్య విభేదాలపై పలుసార్లు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకినా ఫలితం లేకపోయింది. తాజాగా పురందేశ్వరి చంద్రబాబును విమర్శించారు. ఇందుకు స్పందించిన టీడీపీ నేతలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పురందేశ్వరి ఇంకితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు..ఈవిడ బీజేపీలో కొత్త బిచ్చగత్తేమో అనిపిస్తోందంటూ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. పోలవరానికి నిధులు ఇవ్వాల్సింది కేంద్రమేనని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నిధులు ఇవ్వని కేంద్రాన్ని తప్పుబట్టకుండా..చంద్రబాబును విమర్శించడంలో అర్థంలేదని గోరంట్ల మండిపడ్డారు. దాంతో బిజెపి నాయకులు, తెలుగుదేశం నాయకుల మధ్య ఉన్న విభేదాలు తేటతెల్లమయ్యాయి. కాగా కేంద్రం నుండి ఆశించిన మేర సహకారం లేని కారణంగా రాష్ట్రంలో ముందు బిజెపితో తెగతెంపులు చేసుకొని... తర్వాత కేంద్రంలో కూడా విభేదించాలని టిడిపి వర్గాలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more